వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ వరదలు: ముళ్లపెరియార్ డ్యామ్‌పై సుప్రీం కీలక ఆదేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముళ్లపెరియార్‌ డ్యామ్‌ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ముళ్లపెరియార్‌ డ్యామ్‌లో ఆగస్టు 31 వరకూ నీటిమట్టాన్ని రెండు నుంచి మూడు అడుగులు తక్కువగా(139.998 అడుగులు) నిర్వహించాలని సుప్రీం కోర్టు తమిళనాడును ఆదేశించింది. కేరళ వరదలను దృష్టిలో ఉంచుకుని సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళనాడు, కేరళ పరస్పర సహకారంతో ప్యానెల్‌ ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించింది. ముళ్లపెరియార్‌ డ్యామ్‌ సబ్‌కమిటీ ఆగస్టు 23న భేటీ అయిన సందర్భంగా సుప్రీం కోర్టు అనుమతించిన పరిమితికి రెండు అడుగులు తక్కువగా 139 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిందని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది.

Kerala floods: Keep water level at Mullaperiyar dam 3 feet below permissible limit says SC

ముళ్లపెరియార్‌ డ్యామ్‌ నుంచి తమిళనాడు ఒక్కసారిగా నీటిని విడుదల చేయడం వల్లే వరదలు సంభవించాయని కేరళ సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం కన్విల్కార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్‌ తాజా ఆదేశాలు జారీ చేసింది.

English summary
The water level will be kept 2 to 3 feet below the permissible limit at the Mullaperiyar dam, the Supreme Court has said. The current water level is at 139.998 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X