Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala. పందలం దెబ్బతో ప్రభుత్వానికి షాక్, అందుకే శబరిమలపై దృష్టి? దేవుడు ఉన్నాడు, దెబ్బకు !

శబరిమల/కొచ్చి/ పందలం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం శబరిమల దేవస్వం బోర్డు గురించి పట్టించుకోని కేరళ ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెలిరిచినట్లు ఉంది. శబరిమల ఆలయం ఉన్న పందలం మునిసిపాలిటీని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ కైవసం చేసుకోవడంతో కేరళ ప్రభుత్వం ఉలిక్కిపడింది. శబరిమల ఆయలం నిర్వహణ కోసం, మకరవిలక్కు పండుగ నిర్వహణ కోసం అంటూ కేరళ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది.

 ఎవరి రాజకీయాలు వాళ్లవే

ఎవరి రాజకీయాలు వాళ్లవే

కేరళలోని శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలోకి 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని కేరళలోని ఎల్ డీఎఫ్ నేతలు నానా హంగామా చేశారు. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి మద్దతు ఇవ్వాలని ఆందోళన చేసిన మహిళా సంఘాలకు ఎల్ డీఎఫ్ నేతలు బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. అయ్యప్పస్వామితోనే మీరు రాజకీయాలు చేస్తారా ? అంటూ పందలంలోని ప్రజలు మండిపడ్డారు.

 చరిత్రను మారుస్తారా !

చరిత్రను మారుస్తారా !

ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీళ్లేదని, మీ రాజకీయాల కోసం చరిత్రను మార్చడం కుదరదని రాజకుటుంబ సభ్యులు అప్పట్లో లేల్చిచెప్పారు. అయితే హిందువుల మనోభాలతో చెలగాటం ఆడుతున్నారని పందలంలోని హిందువులు మీకు ఏం పోయేకాలం వచ్చింది అంటూ ఎల్ డీఎఫ్ నేతల మీద కారాలు మిరియాలు నూరారు. అయినా స్థానిక నాయకులు మాత్రం హిందువుల మనోభావాలు లెక్కచెయ్యకుండా వారు చెప్పిందే వేదం అనే రీతిలో ప్రవర్తించారు.

 సినిమా చూపించి చీటి చంపేసిన ఓటర్లు

సినిమా చూపించి చీటి చంపేసిన ఓటర్లు

ఈనెల డిసెంబర్ 8. 10. 14వ తేదీల్లో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పందలం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. 2015లో పందలం మునిసిపాటి ఎన్నికల్లో ఎల్ డీఎఫ్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 2020 డిసెంబర్ లో జరిగిన పందలం మునిసిపాలిటీ ఎన్నికల్లో అధికార ఎల్ డీఎఫ్ పార్టీ నేతలకు స్థానిక ఓటర్లు సినిమా చూపించి వారి చీటి చింపేశారు.

 ఇంట్లో దుప్పటి కప్పుకోండి

ఇంట్లో దుప్పటి కప్పుకోండి

పందలం (శబరిమల) మునిసిపాలిటీలోని 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పందలం మునిసిపాలిటీలోని 17 వార్డుల్లో ఎన్డీఏ (బీజేపీ) అభ్యర్థులు విజయం సాధించారు. ఇంతకాలం పందలంలో అధికారంలో ఉన్న ఎల్ డీఎఫ్ పార్టీ కేవలం 7 వార్డుల్లో విజయం సాధించింది. యూడీఎఫ్ ఐదు వార్డులో విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో వివిద పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. హిందువుల మనోభావాలతో గేమ్స్ ఆడిన మీకు ఇప్పుడు సరైన బుద్ది చెప్పామని, ఇంటికి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోవాలని ఎల్ డీఎఫ్ నాయకులకు పందలం ప్రజలు చెప్పారు.

 ప్రభుత్వం జిమ్మిక్కులు మేము నమ్మం

ప్రభుత్వం జిమ్మిక్కులు మేము నమ్మం

పందలం మునిసిపాలిటీలో ఓడిపోయిన కేరళ ప్రభుత్వం స్థానికులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు శబరిమలకు నిధులు మంజూరు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. కేరళ ప్రభుత్వ జిమ్మిక్కులు మాత్రం మేము నమ్మమని పందలం మునిసిపాలిటీ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది శబరిమలకు వెళ్లలేని భక్తులు వారివారి సొంత రాష్ట్రాల్లోని అయ్యప్పస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం శబరిమల నిర్వహణ కోసం నిధులు మంజూరు చెయ్యడానికి సిద్దం కావడం వారికే మంచిదని అయ్యప్ప భక్తులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+