Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లినీ కుటుంబానికి సర్కార్ బాసట, భర్తకు ఉద్యోగం,రూ. 20 లక్షల పరిహారం

తిరువనంతపురం :నిపా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తూ అదే వ్యాధికి గురైన లిని అనే నర్సు కేరళలో మృతి చెందింది. అయితే లినీ కుటుంబానికి కేరళ ప్రభుత్వం అండగా ఉంటామని ప్రకటించింది. నర్సు లినీ భర్త సజీశ్‌కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇద్దరు పిల్లలకు చెరో రూ.10 లక్షలను కేటాయించనున్నట్టు సీఎం విజయన్ ప్రకటించారు.

Recommended Video

    Nipah Virus: Everything About The Virus That's Taking Lives In Kerala

    కేరళ మంత్రివర్గం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ప్రాణాలను ఫణంగా పెట్టి లినీ తన వృత్తిని నిర్వహించిన విషయాన్ని కేరళ సర్కార్ ప్రస్తావించింది. దీంతో లినీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారి ఇద్దరు పిల్లలకు కూడ రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.

    Kerala govt offers job to NIPAH victim nurse’s hubby; Rs 10 lakh each for sons

    నిపా వైరస్ వ్యాధిబారిన పడి మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహరాన్ని చెల్లించనున్నట్టు కేరళ ప్రభుత్వం డిసైడ్ చేసింది. కోజికోడ్ లో పెరంబరా ఆసుపత్రిలో నిపా వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందించిన లినీ ఈ వ్యాధి బారిన పడింది.

    ఈ వ్యాధికి గురైన లినీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. అయితే మరణించడానికి ముందు ఆమె తన భర్తకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తెలిసిందే.

    నిపా వైరస్ కేసులు సుమారు 13కి పైగా నమోదయ్యాయి. సుమారు 10 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాతపడ్డారని కేరళ అధికారులు ప్రకటించారు. ఈ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+