అర్ధ నగ్న శరీరంపై కొడుకుతో పెయింటింగ్- హైకోర్టు తుది తీర్పు
తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇదివరకు ఉద్యమాన్ని నడిపించిన కేరళ సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమా. అర్ధ నగ్న శరీరంపై కుమారుడు, కూతురితో బాడీ పెయింట్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇప్పుడీ కేసును కేరళ హైకోర్టు కొట్టేసింది. మహిళ నగ్న శరీరాన్ని చూడటం డిఫాల్ట్‌గా లైంగికంగా పరిగణించట్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. నగ్న శరీరంపై పెయింట్ వేయించుకోవడాన్ని అశ్లీలంగా, అసభ్యకరంగా పేర్కొనలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు రెహానా ఫాతిమాపై నమోదైన కేసులను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తుది తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తన పిల్లలు బొమ్మలను చిత్రీకరించడానికి ఒక తల్లి తన శరీరాన్ని కాన్వాస్‌గా మలచుకోవడంలో తప్పు లేదని అన్నారు. మగవారు, ఆడవారి శరీరాలు, నగ్నత్వాన్ని వేర్వేరుగా చూడటం సరికాదని చెప్పారు. పులికలి, థెయ్యం వంటి సంప్రదాయబద్ధమైన వేడుకల్లో పురుషులపై బాడీ పెయింటింగ్ వేయడానికి సమాజం అంగీకరిస్తుందని వ్యాఖ్యానించారు. మహిళ నగ్న శరీరాన్ని శృంగారపరమైన వస్తువుగా లైంగిక కోణంలో చూడటం సరికాదని అన్నారు.

రెహానా ఫాతిమాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. 12 లోపు వయస్సున్న కుమారుడు, 14 సంవత్సరాల వయస్సున్న కుమార్తెతో రెహానా ఫాతిమా బాడీ పెయింట్ వేయించుకున్నారు. 2000 జూన్ నాటి ఘటన ఇది. టాప్ లెస్‌గా ఉన్న ఆమె శరీరంపై ఆమె కొడుకు, కూతురు పెయింట్ వేస్తోన్న దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 19 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో కేరళలో దుమారం రేపుతోంది.
బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ పేరుతో యూట్యూబ్ లో ఆమె పోస్టు చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోను చూసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ అరుణ్ ప్రకాశ్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు తిరువళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో, ఐటీ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్‌ల కింద కేసులు నమోదయ్యాయి. వాటన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది.
శబరిమలలో మహిళల ప్రవేశాన్ని కల్పిస్తూ ఉద్యమించిన సమయంలో కూడా రెహానాపై పలు కేసులు నమోదు అయ్యాయి. బిందు, కనకదుర్గతో కలిసి రెహానా ఫాతిమా శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. మత విధ్వేషాలను రెచ్చగొడుతున్నారనే కారణంతో కేసులు పెట్టారు. ఆ సమయంలో ఆమె ఇంటిపైనా మలయాళీలు రాళ్లతో దాడి చేశారు. కుటుంబ సభ్యులు సైతం ఆమెను వెలి వేశారప్పట్లో.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications