కాస్త తగ్గుముఖం: కేరళలో 17 వేల కేసులు.. 208 మంది మృతి
దైవభూమి కేరళలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇదివరకు రోజుకు 25 వేల కేసులు రాగా.. ఇవాళ కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 17,681 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44,24,046కు చేరింది. ఇవాళ 208 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య కూడా 22,987కు పెరిగింది. ఇవాళ 25,588 మంది కరోనా బాధితులు మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 42,09,746కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో కరోనా మరణాలు, రికవరీలు పోగా ప్రస్తుతం1,90,750 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో గల 14 జిల్లాల్లో మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. అందులో ఇవాళ తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 2,143 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొట్టాయం 1,702 కేసులు, కోజికోడ్ 1,680 కేసులు ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కేరళ ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications