లవ్ జిహాద్ కేసులో.. కొత్త మలుపు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లవ్ జిహాద్ కేసు సుప్రీంకోర్టులో కొత్తమలుపు తిరిగింది. కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా
న్యూఢిల్లీ : కేరళ లవ్ జిహాద్ కేసు సుప్రీంకోర్టులో కొత్తమలుపు తిరిగింది. కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా కేసు విచారణ ఇవాళ ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది.
అసలు హదియ వాంగ్మూలం సేకరించవద్దని ఎన్‌ఐఏ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హదియను హిప్నటైజ్ చేశారని, ఆమె మాటలు నమ్మవద్దని ఎన్‌ఐఏ వాదించగా, ఆ వాదనలను హదియ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హదియ కేసు ఓ అసాధారణమైనదని, హదియా వాంగ్మూలంపై ఇప్పుడికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని పేర్కొంది. విచారణకు హాజరైన హదియను ...ఉన్నత న్యాయస్థానం మీకేం కావాలని ప్రశ్నించగా... తనకు స్వేచ్ఛ కావాలని ఆమె సమాధానం చెప్పింది.
అంతేకాదు, తాను మెడిసన్ పూర్తి చేసి, డాక్టర్ కావాలనుకుంటున్నట్లు హదియా కోర్టుకు విన్నవించింది. దీంతో ఆమె తన చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు సేలంలోని హోమియోపతి కళాశాల డీన్‌ను గార్డియన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హదియ గతేడాది డిసెంబర్‌లో మతమార్పిడి చేసుకుని ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవటం.. ఆమె తండ్రి అది బలవంతపు మత మార్పిడి వివాహం అని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం 'లవ్ జిహాద్ కేసు' గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
ఆ తరువాత ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. గతంలో హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేయగా... ఆమె భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications