వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబ్బు వాడినా అందం ఇవ్వలేదు, పరిహారం వచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మా ప్రోడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఊదరగొట్టే యాడ్‌లను రోజు చూస్తుంటాం. వాటిని మనం ఎవరు కూడా సీరియస్‌గా తీసుకోమనే చెప్పవచ్చు. కానీ ఓ అడ్వర్టయిజ్‌మెంటును సీరియస్‌గా తీసుకున్న శిల్పి ఏకంగా సబ్బును వాడి, ఆ తర్వాత అది పని చేయకపోవడంతో కోర్టుకెక్కారు.

దీంతో, 'మా సబ్బు వాడండి అందం వెతుక్కుంటూ వస్తుందం'టూ ప్రకటనలతో ఊదరగొట్టిన ఓ సంస్థ వినియోగదారుకి రూ.30,000 నష్ట పరిహారం చెల్లించింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

Kerala man sues Mammootty, soap brand; gets Rs 30,000 as it didn't make him fair

మలయళం టీవీ ఛానెల్స్‌లో ప్రకటనలతో ఊదరగొడుతున్న ఇందులేఖ సబ్బుతో తన ఫేట్ మారుతుందని భావించిన చాతూ అనే శిల్పి వినియోగదారు ఏడాది పాటు ఆ సబ్బును వాడారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ సబ్బు ప్రకటనలో నటించిన మోహన్ లాల్, ఆ సబ్బును తయారు చేస్తున్న సంస్థ తనను మోసం చేశాయంటూ వాయానంద్‌లోని వినియోగదారుల కోర్టులో 2015 సెప్టెంబర్ లో కేసు నమోదు చేశారు.

సమాజంలో ఎంతో పలుకుబడి, ప్రభావం ఉన్న మమ్ముట్టీ ప్రకటనను చూసి ఆ సబ్బును వాడానని, అయితే ఎలాంటి ఫలితం లేదని, తనకు నష్టపరిహారం అందజేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఎలాంటి ప్రతివాదనకు అవకాశం ఇవ్వకుండా పరిహారంగా రూ.30,000 రూపాయలు చెల్లిస్తామని ఇందులేఖ సబ్బు తయారీ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.

English summary
We are bombarded by advertisements of fairness creams, soaps and face wash on a daily basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X