లైవ్ షోలో మంత్రిపై దాడి: ఆస్పత్రికి తరలింపు
కొల్లాం: ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిపై దాడి జరగడం కేరళలో సంచలనంగా మారింది. ప్రేక్షకులు దాడి చేయడంతో కేరళ కార్మిక మంత్రి శిబు బేబీ జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన విజయ్ పిళ్లై గాయపడ్డారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జాన్ బదులిస్తుండగా కొందరు వారిపై రాళ్లు రువ్వి, కుర్చీలు విసిరారు. వెంటనే తేరుకున్న సిబ్బంది వారిని అక్కడ్నుంచి తరలించారు.

కాగా, తాగు నీటి సమస్య తీర్చని కారణంగానే స్థానిక ప్రజలు కొందరు వీరిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాము తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సదరు మంత్రి తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
ఈ దాడిలో విజయ్ పిళ్లైకి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు నేతలను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.












Click it and Unblock the Notifications