భారత్ లో ఐఎస్ఐఎస్ రిక్రూటర్ పీఎఫ్ఐ పార్టీ: కేరళ సీఎంకు పోలీసుల నివేదిక, సీరియస్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళలోని యువకులను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులుగా మార్చుతున్న వారు ఎవరు అనే విషయం ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ నాయకులు యువతను రెచ్చగొట్టి ఐఎస్ఐఎస్ లో చేర్చుతున్నారని వెలుగు చూసింది.

కేరళలో మాయం అవుతున్న యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో చేరారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కేరళ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. మాయం అయిన ఆరు మంది యువకులను గుర్తించి పూర్తి సమాచారం సేకరించారు. కేరళ పోలీసుల విచారణలో ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి.

Kerala PFI is India’s ISIS recruiter says police probe

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇస్లామిక్ ఫండమెంటలిస్టు కలిసి యువతని రెచ్చగొట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా మార్చుతున్నారని గుర్తించారు. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని పాపురల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తున్నదని, ఆరు మంది యువకులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరారని గుర్తించి నివేదిక తయారు చేశారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కుట్రల సమాచారం సేకరించి నివేదిక తయారు చేసిన కేరళ పోలీసులు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయంలో అందించారు. విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలిసింది. పీఎఫ్ఐ మాత్రం మరోలా వాదిస్తోంది. మేము దేశంలో కేవలం ఆర్ఎస్ఎస్ మీద పోరాటం చేస్తున్నామని, హిందూవులు అందరిమీద కాదని అంటోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sending ripples across Kerala, the state police on Thursday claimed that six people currently serving for ISIS had links with the Popular Front of India, an Islamic fundamentalist organisation. In a report submitted by state police to the chief minister's office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి