రేడియో జాకీని నరికి చంపేశారు: మిత్రుడికి గాయాలు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో మాజీ రేడియా జాకీని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి అతని స్టూడియో వద్దనే ఆ ఘాతుకానికి పాల్పడ్డారు
మాజీ ఆర్జె రాజేష్ అలియాస్ రసికాన్ రాజేష్ (36) మిమిక్రీ ఆర్టిస్టు, జానపద గాయకుడు కూడా. ఈ సంఘనలో అతని మిత్రుడు గాయపడ్డాడడు. పల్లిక్కల్ పోలీసు స్టేషన్ పరిధిలోని మడవూరులో రాజేష్‌కు మెట్రో స్టూడియో అనే సౌండ్ రికార్డింగ్ స్టూడియో ఉంది. అక్కడే అతను హత్యకు గురయ్యాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఓ ముఠా ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేష్ అతని మిత్రుడు కుట్టన్ ఓ ప్రదర్శన నుంచి తిరిగి వచ్చి, పరికరాలను స్టూడియోలో పెడుతున్న సమయంలో మారుతి స్విఫ్ట్ కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుట్టన్ తిరువనంతపురం వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దోహాలోని వాయిస్ ఆఫ్ కేరళ ఎఫ్ఎం స్టేషన్‌లో చేరడానికి ముందు రాజేష్ చాలా సంవత్సరాలు రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేశాడు.
రాజేశ్ ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చి మిమిక్రి బృందంలో చేరినట్లు తెలుస్తోంది. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications