కేరళలో కరోనా కల్లోలం.. 11 వేలకు చేరువలో కేసులు.. 120 మంది మృతి
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న రాష్ట్రంలో.. గత నెల రోజులుగా దాదాపు 10 వేల కేసులు, వందకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 10,944 కరోనా కేసులు, 120 మరణాలు కలిగాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,74,639కి, మొత్తం మరణాల సంఖ్య 26,072కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 46,31,300కి చేరింది.
గత 24 గంటల్లో 95,510 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,645 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో 12,922 మంది కరోనా రోగులు కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications