అంబులెన్స్ డ్రైవర్ సాహసం: చిన్నారి ప్రాణం కోసం 516కి.మీలను 7గంటల్లోపే.!
తిరువనంతపురం: ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు కేరళకు చెందిన ఓ అంబులెన్స్ డ్రైవర్..
తిరువనంతపురం: ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు కేరళకు చెందిన ఓ అంబులెన్స్ డ్రైవర్.. తన ప్రాణాలను పణంగా పెట్టి ఎవరూ చేయలేని సాహసం చేశారు. కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వరకు ఉన్న 516కి.మీల దూరాన్ని కేవలం 7గంటల్లోనే చేరుకునేలా అంబులెన్స్ నడిపాడు డ్రైవర్ తమీమ్.

13గంటలు పట్టే సమయం..
గూగుల్ మ్యాప్స్ ప్రకారం చూస్తే ఈ దూరాన్ని చేరడానికి దాదాపు 13గంటలు పడుతుంది. మధ్యలో ఆగిన 15నిమిషాల విరామాన్ని వదిలేస్తే తిరువనంతపురానికి తమీమ్ కేవలం 6గంటల 45నిమిషాల్లోనే చేరుకున్నాడు.

వేగం తగ్గకుండా..
గంటకు 76కి.మీల సరాసరి వేగంతో తమీమ్ అంబులెన్స్‌ను నడిపట్లు తెలుస్తోంది. అంతకుముందు 58రోజుల వయస్సున్న చిన్నారి ఫాతిమా లాబియాను విమానం ద్వారా పంపించాలని కన్నూరులోని పరియారం మెడికల్ కాలేజీ, ఆసుపత్రి యాజమాన్యం అనుకున్నాయి.

రోడ్డు మార్గమే..
కానీ, విమాన అంబులెన్స్ సిద్ధం చేయడానికే చాలా సమయం పడుతుందని తెలిసి.. రోడ్డు మార్గం ద్వారానే పంపించాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమీమ్ అంబులెన్స్‌లో ఆ చిన్నారి బయల్దేరింది.

అందరి సహకారంతో.. కానీ..
కాగా, ఈ ప్రయాణంలో కేరళ పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్, కేరళ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రోడ్డు మీద ట్రాఫిక్ క్లియర్ చేసి.. అంబులెన్స్‌కు మార్గాన్ని సుగమం చేయడంలో సహాయపడ్డారు. సరైన సమయానికే తిరువనంతపురంలోని శ్రీచిత్ర మిషన్ ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆ చిన్నారి తొందరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications