దేవభూమిలో బీఫ్ డిష్: పర్యాటక శాఖపై వీహెచ్‌పీ గరం: గో ప్రేమికుల మనోభావాలతో ఆటలా అని ఫైర్
కేరళ పర్యాటక శాఖపై విశ్వహిందూ పరిషత్ ఒంటికాలిపై లేచింది. ఇటీవల కేరళ టూరిజం పర్యాటకులకు ఆకర్షించడంలో భాగంగా బీఫ్ డిష్ వంటకానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై వీహెచ్‌పీ స్పందిస్తూ.. ఓ మతస్తుల మనోభావాలను కించపరచడం సరికాదని మండిపడింది.

బీఫ్ డిష్..
పర్యాటకులను ఆకర్షించేందుకు బుధవారం రోజున ట్విట్టర్‌లో బీఫ్ డిష్ ఫోటోలను కేరళ టూరిజం శాఖ పోస్ట్ చేసింది. అందులో ‘సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి ముక్కలతో కాల్చిన గొడ్డు మాంసం, కరివేపాకులు వేసి రుచికరంగా అందజేయబోతున్నాం' అని పేర్కొన్నది. కేరళకు పర్యాటకులను ఆకట్టుకోవడమేనని చెప్పినా.. హిందువులను ఇబ్బందికి కలిగించేలా ఉందని వీహెచ్‌పీ మండిపడింది.

పర్యాటకమా..? బీఫ్ ప్రమోటా..?
పర్యాటక శాఖ పోస్ట్ చేసిన ఫోటో యొక్క అర్థం ఏమిటి అని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ప్రశ్నించారు. ఇది కేరళ పర్యటకాన్ని ప్రమోట్ చేసే మాదిరిగా ఉందా ? లేదంటే గొడ్డు మాంసాన్ని ప్రమోట్ చేసేలా ఉందా అని అడిగారు. కానీ ఓ మతస్తులను, గోవులను ప్రేమించేవారి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది అని మండిపడ్డారు. కేరళ పవిత్ర భూమి అని, ఇక్కడే శంకరాచార్య జన్మించారని.. అంతటి విశిష్టత ఉన్న స్థానంలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
గవర్నర్‌కు ట్వీట్ ట్యాగ్
కేరళ టూరిజం చేసిన ట్వీట్‌ను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ పర్యాటకశాఖ మంత్రి కడకమ్‌పల్లి సురేంద్రన్‌కు ట్యాగ్ చేశారు. ఫోటోపై కేరళ పర్యాటక శాఖను సలహా ఇవ్వామని అందులో కోరారు. వీరితోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పర్యాటకశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కేరళ పర్యాటక శాఖ ట్వీట్ చేసిన ఫోటోను వినోద్ బన్సాల్ ట్యాగ్ చేశారు.

సంక్రాంతి సమయంలో..
మకర సంక్రాంతి, పొంగల్, బిహు పండగలను దక్షిణ భారతదేశంలో పెద్ద పండుగలు. సరిగ్గా పండగ సమయంలోనే కేరళ టూరిజం బీఫ్ ఫోటోలు ట్వీట్ చేయడం వివాదానికి కారణమైంది.
-
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
'తెలంగాణ అమర్నాథ్ యాత్ర'.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..?? -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications