వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ సవరణ చట్టంకు కేరళ వ్యతిరేకం: అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం పినరాయి విజయన్

|
Google Oneindia TeluguNews

కేరళ: పౌరసత్వ సవరణ చట్టం అమలును విరమించుకోవాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చట్టంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టంను ఎట్టి పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం ఆమోదం తెలపదని పినరాయి విజయన్ స్పష్టం చేశారు.అంతేకాదు రాజకీయ పార్టీలు, మతాధిపతులు, సామాజిక నేతలతో జరిగిన సమావేశంలో పౌరసత్వ సవరణ చట్టంను తామంతా వ్యతిరేకిస్తున్నట్లు తనకు, ప్రతిపక్షనాయకుడితో చెప్పారని విజయన్ ట్వీట్ చేశారు.

అక్రమవలసదారుల కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న నిర్బంధ గృహాల కాన్సెప్ట్ కేరళలో రాదని స్పష్టం చేశారు సీఎం పినరాయి విజయన్. అంతేకాదు పౌరసత్వ సవరణ చట్టంను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సమర్థించడాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తీవ్రంగా తప్పుబట్టింది. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చరిత్రను బీజేపీ ఎలా అయితే కాలరాస్తుందో వారి ప్రతినిధిలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని కేరళ ప్రతిపక్ష పార్టీ విమర్శించింది. పౌరసత్వంపై ఓ కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్... కాంగ్రెస్ 1947లోనే బిల్లను ఆమోదించేందుకు అంగీకారం తెలిపిందని గుర్తుచేశారు. గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరించడం దురదృష్టకరమని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

Kerala will not accept CAA, CM Pinarayi Vijayan moves resolution in assembly

పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్ ఐడియా అని చిత్రీకరిస్తున్న గవర్నర్ తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేత జోసెఫ్. కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పీఆర్వోగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ వీఎం సుధీరన్ ఆరోపించారు. కేరళ లౌకికత్వం ఉన్న రాష్ట్రంగా పేరుందని అసెంబ్లీలో సీఎం పినరాయి విజయన్ చెప్పారు. ఈ రాష్ట్రంలో గ్రీకులు, రోమన్స్, అరబ్బులు నివసిస్తున్నారని చెప్పారు. అంతేకాదు కేరళ భూమిపై క్రిస్టియన్లు, ముస్లింలు తొలుత అడుగుపెట్టారని గుర్తుచేశారు. కేరళకు ఒక సంప్రదాయం ఉందని దాన్ని కాలరేసేందుకు ఎవరు ప్రయత్నించిన దాన్ని అడ్డుకుంటామని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు.

English summary
Kerala chief minister Pinarayi Vijayan on Tuesday moved a resolution against the Citizenship Amendment Act in the state Assembly demanding withdrawal of the contentious legislation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X