దినకరన్ విజయం ఇలా: తెలుగు ఓటర్లు, హీరో విశాల్ వ్యవహారం...

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల లో టి. టి. వి.దినకరన్ విజయానికి తెలుగు ఓటర్లే కారణమని తమిళనాడు తెలుగు యువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడియంకె ప్రభుత్వానికి రెఫరెండం కాదని అన్నారు బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం సహజమని అభిప్రాయపడ్డారు.

విజయం: దినకరన్‌ను అభినందించిన హీరో విశాల్

తమిళనాడులో బీజేపీ పాగా వేయడం కష్టమని, ముఖ్యంగ ఈ విజయం ధన విజయం తప్పితే ఇంకోటి కాదని కూడా ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో దినకరన్ చేసిన ప్రజాసేవ ఎమిటో .ఆయన చైపాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగువారి ఓట్ల కోసం ఇలా..

తెలుగువారి ఓట్ల కోసం ఇలా..

ఆర్.కె.నగర్ తెలుగు ఓటర్లు చాలా అదృష్టవంతులని జయలలిత రెండుసార్లు, దినకరన్ రెండుసార్లు పోటీ చేయటమే వారు చేసుకున్న భాగ్యమని అన్నారు. పోలింగ్ ముందు రోజు జయలలిత వీడియోను ఓటర్ల ముందు ఉంచటం, పోలింగ్ విధానం చూస్తే ప్రజాస్వామ్య విధంగా జరగలేదని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

ఓటర్లకు భారీగా డబ్బులిచ్చారు..

ఓటర్లకు భారీగా డబ్బులిచ్చారు..

మహిళలు వారి ఇంటి ముందు ఆ య పార్టీ ల రంగవల్లులు వేస్తే డబ్బులు చెల్లించారని, అది ఓ పద్దతి ప్రకారం జరిగిందని, అక్కడ ఎక్కువగా నిరుపేద ఓటర్లు ఉండడమె దినకరన్ విజయానికి కారణమని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

 విశాల్ నామినేషన్‌ను అలా చేయడం వల్ల

విశాల్ నామినేషన్‌ను అలా చేయడం వల్ల

సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను అధికార పార్టీ తిరస్కరణకు గురయ్యేలా చేశారనే ప్రచారం జరగడం వల్ల, అధికార అన్నాడియంకె అభ్యర్థి విషయంలో సరిగా వ్యవహరించకపోవడం వల్ల, క్యాడర్‌ను సంతృప్తి పరచటంలో విపలం కావడం వల్ల, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో పూర్తిగా విఫలమైనందు వల్ల అన్నాడియంకె అభ్యర్థి ఓడిపోయారని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అన్నారు.గుర్తు మనదే కద అనే ధీమా వల్ల గుర్తు కన్నా డబ్బు గొప్ప దనే విషయాన్ని గుర్తించక పోవడంఅన్నాడియంకె తప్పిదమని అన్నారు.

 జయలలిత పోటీ చేసినప్పుడే...

జయలలిత పోటీ చేసినప్పుడే...

డిఎంకె ఓటు బ్యాంకు ఏమైందో తెలియని పరిస్థితి ఏర్పడిందని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడం చాలా అనుమానాలకు దారి తీస్తోందని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జయలలిత పోటీ చేసినప్పడు వారికి డిపాజిట్ వచ్చిందని ఆయన గుర్తు చేస్తూ దినకరన్ మీద డిపాజిట్ రాకపోవడం వారి కార్యకర్తల లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తోందని ఆయన అన్నారు.

జయలలిత మరణించిన తర్వాత....

జయలలిత మరణించిన తర్వాత....

జయలలిత మరణించిన తర్వాత అన్నాడియంకెలో జరిగిన ప్రతిదాన్నీ అధికారం కోసం పరిణామాలు సంభవించాయని, కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోయిందని కేతిరెడ్డి జగదీశ్వరర్ రెడ్డి అన్నారు. అన్నాడియంకె రెండుగా చీలిపోయింది కాబట్టి ఆ గ్రూపుల మధ్యతగాదా వల్ల మధ్యంతర ఎన్నికలు వస్తే తాము గైలుస్తామనే ధీమా డిఎంకెకు ఉన్నట్లుందని, అందుకే రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడానికి డిఎంకె తన ఓట్లను దినకరన్‌కు వేయించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

 తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం తప్పదా..

తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం తప్పదా..

తమిళనాడులో త్వరలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడడం ఖాయమని ,జయలలిత మరణం తరువాత ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పరిస్థితులను గమనించి కేంద్ర వెంటనే ఎ న్నికలను జరిపించాలని, తమిళనాట శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఇది శశికళ విజయం కాదు..

ఇది శశికళ విజయం కాదు..

ఇది శశికళ విజయం కాదు, డబ్బు విజయమని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. భారత రాజకీయలను శాసించేది డబ్బు మాత్రమే అనే దానికి నిదర్శనం ఈ ఎన్నిక అని ఆయన వ్యాఖ్యానించారు. జయలలిత గెలిచింది గ్లామర్ వల్ల ప్రజ సేవ వల్ల అని ఆయన అన్నారు. దినకరన్‌కు ఆ నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియవని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Telugu yuvaskti leader Kethireddy Jagadeeswar Reddy said that Dinakaran has won RK Nagar election with Telugu voters.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి