వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ABP-CVoter Opinion Poll 2022: ఐదు రాష్ట్రాల్లో గెలుపు గుర్రాలివే-హోరాహోరీ పోరే

|
Google Oneindia TeluguNews

జాతీయ మీడియా నూస్ ఛానల్ ఏబీపీ న్యూస్ సీఓటర్ తో కలిపి నిర్వహించిన ఒపీనియల్ పోల్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు వెలుగుచూశాయి. ఇందులో ఐదు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల గెలుపు, ఓటములు, ఓట్ల శాతాలకు సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ తో మొదలుపెట్టి చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్ వరకూ ఈ ఒపీనియన్ పోల్ పలు అంశాలను బయటపెట్టింది.

ఉత్తర్ ప్రదేశ్ హోరాహోరీ

ఉత్తర్ ప్రదేశ్ హోరాహోరీ

ఏబీపీ న్యూస్-సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ తన ఓట్ల శాతాన్ని 23.6 నుంచి 33.5 వరకూ పెంచుకోబోతోందని తేలింది. కొద్ది నెలల క్రితం కూడా సమాజ్ వాదీ పార్టీ సాధించే ఓట్ల శాతం 30 శాతం కంటే తక్కువగానే ఉండగా.. తాజాగా అది 33 శాతం దాటిపోతోందని తేలింది.

సమాజ్ వాదీ పార్టీ బీజేపీకి ఉన్న 35 శాతం నికర ఓట్ల శాతాన్ని దాటాలంటే కాంగ్రెస్ కు ఉన్న 7 శాతం ఓట్లు కూడా కలుపుకోవాల్సి ఉంటుందని నిర్ఘారణ అయింది. అయితే తాజా అంచనాల్లో బీజేపీకి గతంలో లభించిన 41 శాతం ఓట్లు కొనసాగే అవకాశమున్నట్లు తేలింది. బీఎస్పీ ఓట్ల శాతం గత ఎన్నికల్లో ఉన్న 22 శాతం నుంచి 12 శాతానికి ఈసారి పడిపోనుంది. ఈ ఓట్లను చీల్చుకోగలిగే పార్టీయే విజేతగా నిలిచినా ఆశ్చర్యం లేకపోవచ్చు.

పశ్చిమ యూపీలో రైతు నిరసనల ప్రభావం బీజేపీపై పడితే మాత్రం అక్కడ బీజేపీకి ఉన్న 41 శాతం ఓట్ల శాతాన్ని ప్రస్తుతం 33 శాతం ఓట్లు కలిగిన సమాజ్ వాదీ పార్టీ కూటమి లాక్కోవచ్చు. అలాగే ప్రియాంక గాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎన్ని హామీలిస్తున్నా గతంలో గెలిచిన ఏడు సీట్ల నుంచి ఐదు సీట్లకు పరిమితం కావొచ్చని తెలుస్తోంది.

 ఉత్తరాఖండ్ లో హస్తవాసి

ఉత్తరాఖండ్ లో హస్తవాసి

ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర అంశం ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రమే. కాంగ్రెస్‌ కీలక నేత, మాజీ సీఎం హరీష్ రావత్ 37% మద్దతుతో ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కంటే చాలా ముందున్నారు. సీఎం పుష్కర్ సింగ్ కు కేవలం 29 శాతం ఓటర్ల మద్దతు మాత్రమే లభిస్తోందని ఏబీపీ న్యూస్-సీఓటర్ అంచనా వేసింది.

బీజేపీ ఏడాదిలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో పరిస్ధితిని చూస్తే బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న 70 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 34, కాంగ్రెస్ 33 సీట్లు గెలుస్తాయని అంచనా. 2017 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5% ఓట్లను సాధించింది.

2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 8% తగ్గుతుందని అంచనా. 2017 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 57 సీట్లు గెలుచుకుంది. ఏబీపీ-సీఓటర్ తాజా ఒపీనియన్ పోల్ ప్రకారం 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 23 సీట్లు కోల్పోతుందని అంచనా. అలాగే ఆప్ ప్రభావం కూడా బీజేపీపై పడబోతోంది. దీంతో కాంగ్రెస్ గెలుపు సునాయాసం కావొచ్చని ఏబీపీ అంచనా.

 పంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ హోరాహోరీ

పంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ హోరాహోరీ

తాజా ఏబీపీ న్యూస్-సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వరుసగా 40%, 36% ఓట్లను సాధిస్తాయని అంచనా వేసారు. ఓట్ల శాతంలో ఆధిక్యం ఉన్నప్పటికీ, ఓటర్-బేస్ యొక్క ప్రాంతాల వారీ పంపిణీ కారణంగా ఆప్ మెజారిటీ కంటే తక్కువగా ఉండవచ్చు. అలాగే, రాష్ట్రంలో మొదటి దళిత ముఖ్యమంత్రిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రయోజనం పొందుతోందని అంచనా. అది తన దళిత ఓటర్లపై పట్టు కొనసాగించేందుకు పనికొస్తోంది.

శిరోమణి అకాలీదళ్ (బాదల్) 18% ఓట్లు సాధించే అవకాశముందని తెలుస్తోంది. ఈ లెక్కన దాదాపు 20 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. కెప్టెన్ అమరీందర్ సింగ్, బిజెపి పొత్తులు చెప్పుకోదగ్గ విషయంగా కనిపించడం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం బీజేపీ-అమరీందర్ కలిసి పోటీ చేసినా వీరిద్దరి ఓట్ల శాతం 2, సీట్లు కూడా రెండు రావొచ్చని అంచనా. అయితే 30 సీట్లలో మిగతా పార్టీల అవకాశాల్ని వీరు ప్రభావితం చేయబోతున్నారు.

సీఎంగా చన్నీకి 29 శాతం మంది మద్దతు లభిస్తుండగా.. సిద్ధూకు కేవలం 6 శాతం మద్దతే దొరికింది. ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ సింగ్ మాన్ కు మాత్రం మద్దతు అనూహ్యంగా పెరిగి 13 శాతం నుంచి 23 శాతానికి చేరడం విశేషం.

గోవాలో బీజేపీకే ఛాన్స్

గోవాలో బీజేపీకే ఛాన్స్

చిన్న రాష్ట్రమైన గోవా అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మరోసారి పట్టం గట్టే అవకాశాలున్నాయని ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేస్తోంది. 32 శాతం ఓట్లతో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. అలాగే 23 శాతం ఓట్లతో ఆప్ అక్కడ ప్రధాన విపక్ష పార్టీగా ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ 19 శాతం ఓట్లతో మూడో స్ధానానికే పరిమితం కానుంది. 40 సీట్ల అసెంబ్లీలో బీజేపీకి 21 సీట్లు, ఆప్ కు 7, కాంగ్రెస్ కు 6 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నా కేవలం 8 శాతం ఓట్లకు మాత్రమే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు తప్పేలా లేదని ఏబీపీ-సీఓటర్ సర్వే అంచనాలు చెప్తున్నాయి. ఇక్కడ బీజేపీ 36 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ 33 శాతం ఓట్లకు పరిమితం అవుతోంది. తాజా అంచనాల ప్రకారం వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ లెక్కన బీజేపీకి 25 సీట్లు, కాంగ్రెస్ కు 24 సీట్లు దక్కబోతున్నట్లు ఒపీనియన్ పోల్ అంచనా వేస్తోంది. నాగా జాతి పార్టీ ఎన్పీఎఫ్ 4 స్థానాలను గెలుచుకోవచ్చని, అలాగే ఇతరులకు 7 సీట్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో వీరే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.

English summary
abp news-cvoter opinion poll results released on upcoming five state assembly elections in 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X