Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఈసారి ఐదు గ్యారంటీలు..!

రెండు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో సిద్ధమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దేశంలో మారిన పరిస్దితులు, కేంద్రంలో బలంగా ఉన్న అధికార ఎన్డీయేను ఢీకొట్టాల్సిన పరిస్ధితుల్లో ఉన్న కాంగ్రెస్.. మ్యానిఫెస్టోలో కీలక హామీల్ని సిద్దం చేస్తోంది. ఇందులో రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, బీసీ కులాలు కోరుతున్న కుల గణనతో పాటు మరిన్ని సంచలన హామీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ నేత చిదంబరం అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ దీనికి తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి మ్యానిఫెస్టోలో దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాహుల్ భారత్ న్యాయ్ యాత్రలో చెబుతున్న పంచ్ న్యాయ్ (ఐదు న్యాయాలు)ను ఐదు గ్యారంటీల రూపంలో ఓటర్లకు హామీలుగా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

key promises expected in congress party s manifesto for loksabha polls 2024

ఎల్లుండి చిదంబరం అధ్యక్షతన సమావేశమవుతున్న కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ముసాయిదాను ఖరారు చేయనుంది. ఆ తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసి వచ్చే నెలాఖరులో దీన్ని విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల్లో గ్యారంటీల హామీలతో విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇఫ్పుడు జాతీయ స్ధాయిలోనూ ఐదు గ్యారంటీల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉత్తరాదిన జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గ్యారంటీలు పని చేయకపోవడంతో దీనికి విరుగుడుగా ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+