నా మీద నాకే అసహ్యంగా ఉంది, కేజీఎఫ్ రాఖీభాయ్ సంచలన వ్యాఖ్యలు !
అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆ పనులు నిర్వహిస్తున్న అభిమానులు దుర్మరణం చెందడంతో కేజీఎఫ్ స్టార్ హీరో రాఖీభాయ్ యశ్ షాక్ కు గురైనాడు. తన పనులన్నింటినీ విడిచిపెట్టిన హీరో యశ్ చనిపోయిన అభిమానుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్బంలో హీరో యశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర తాలూకాలోని గ్రామంలో కేజీఎఫ్ హీరో యశ్ పుట్టినరోజు కోసం కటౌట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆకస్మికంగా విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు అభిమానులు మరణించారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు అభిమానులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పాన్ ఇండియా హీరో యశ్ సోమవారం కర్ణాటకలోని హుబ్బళి విమానాశ్రయానికి చేరుకున్నాడు.

తరువాత హుబ్బళి-ధారవాడ జంట నగరాల ఎస్పీ వాహనంలో లక్ష్మేశ్వర తాలూక్ గ్రామానికి యశ్ వెళ్లి మరణించిన అభిమానుల కుటుంబాలకు ధైర్యం చెప్పాడు. మొదట మరణించిన అభిమాని మురళి ఇంటికి వెళ్లిన హీరో యశ్ అభిమాని తండ్రిని ఓదార్చాడు. ఆ తరువాత నవీన్ గాజీ ఇంటికి, తరువాత మరో అభిమాని హనుమంత హరిజన్ ఇంటికి వెళ్లిన హీరో యశ్ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చి వారికి ధైర్యం చెప్పాడు.
ఇదే సమయంలో విద్యుత్ షాక్ తో గాయపడిన మంజునాథ్, ప్రకాష్, హనుమంత కుటుంబ సభ్యులను హీరో యశ్ ఓదార్చాడు, హనుమంత హరిజన్ (24), మురళి (20), నవీన్ గాజీ (20) మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న హీరో యశ్ అతని పుట్టిన రోజు వేడుకలను పక్కన పెట్టి గదగ్ జిల్లాలో చనిపోయిన అభిమానుల ఇళ్లకు వెళ్లారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన హీరో యశ్ నా అభిమానులకు నాఫోటోలతో ఉన్న బ్యానర్, ఫ్లెక్సీలు, కటౌంట్ లు ఏర్పాటు చెయ్యాలని తాను ఎప్పుడు చెప్పలేదని అన్నారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు మీరు ఇలాంటి పనులు చెయ్యడం వలన ఇలాంటి సంఘటనలు జరగడంతో వాటిని చూసినప్పుడు తనకు భయం అవుతోందని, తన పుట్టినరోజు వస్తుందంటే తాను భయపడే పరిస్థితి ఎదురౌతోందని హీరో యశ్ అందోళన వ్యక్తం చేశారు.

నేను నా బర్త్ డే అంటేనే అసహ్యించుకుంటున్నానని, తన పుట్టిన రోజు ఇలా అభిమానులు చనిపోవడంతో తన మీద తనకే అసహ్యం వేస్తోందని హీరో యశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను నా పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నానని, కోవిడ్ ప్రారంభమైన సమయంలో కూడా పుట్టిన రోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నానని, నా బర్త్ డే కారణంగా ఎవ్వరూ బాధపడకూడదని హీరో యశ్ అన్నారు,
నా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని నేను అభిమానులకు నేరుగా చెబితే అభిమానులు బాధపడుతారని ఇన్ని రోజులు చెప్పలేదని, ఇలాంటి సంఘటనలతో చేతికి అందివచ్చిన కొడుకులు చనిపోతే ఆ కుటుంబాలకు దిక్కుగా ఎవరు ఉంటారని హీరో యశ్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన కోసం చనిపోయిన కుటుంబాలకు ఎవరు అండగా నిలబడతారు? అని హీరో యశ్ ఆయన అభిమానులను ప్రశ్నించాడు.
డబ్బు ఎవరైనా సహాయం చేయగలరు కాని ఇంటి కుమారుడిగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారు చెప్పండి అంటూ హీరో యశ్ ఆయన అభిమానులను ప్రశ్నించారు. తన బర్త్ డే రోజు ఇలా బ్యానర్లు, కటౌట్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలని, బైక్ రేస్ లు చేస్తూ పోటీపడి తనను చూడటానికి రాకూడదని తాను మిమ్మల్ని వేడుకుంటున్నానని కేజీఎఫ్ రాఖీభాయ్ యశ్ మీడియా ద్వారా ఆయన అభిమానులకు మనవి చేశాడు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications