వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడి

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ తో స్నేహం కోరుతున్నామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయడం, దాయాది దేశంతో మన సంబంధాలు గడిన పడుతోన్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ కు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయాలంటూ ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన మరో ఘటన తాలూకు వీడియో ప్రస్తుం కలకలం రేపుతున్నది. ఈశాన్య ఢిల్లీలో గతేడాది అల్లర్లు జరిగిన ప్రాంతంలోనే, ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులే మరోసారి ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. ఈశాన్య ఢిల్లీ పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

 ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

ఖజూరీస్ ఖాస్ ప్రాంతంలో...

ఖజూరీస్ ఖాస్ ప్రాంతంలో...

'హిందూస్థాన్ జిందాబాద్.. పాకిస్తాన్ ముర్దాబాద్.. అని గట్టిగా అరచి చెప్పు' అంటూ ఓ వ్యక్తి.. యువకుడిని కీరాతకంగా కొడుతుండటం, దాడి చేసిన వ్యక్తి స్నేహితుడు వీడియోను చిత్రీకరిస్తూ, 'అసదుద్దీన్ ఓవైసీ, ఆజం ఖాన్ లను కూడా తిట్టు..' అని అరుస్తున్న వీడియో క్లిప్ కొద్ది గంటలుగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈశాన్య ఢిల్లీలోని ఖజూరీస్ ఖాస్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోని

అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్‌కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారిఅబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్‌కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారి

ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు..

ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు..

పాకిస్తాన్, ఓవైసీలను తిట్టాలంటూ యువకుడిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అజయ్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. ఇతను 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు కూడా. గోస్వామి చేతిలో దెబ్బలు తిన్న బాధితుడిని సల్మాన్ గా గుర్తించారు. దాడి వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు గోస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీడియో తీసిన దీపక్(గోస్వామి స్నేహితుడు) మాత్రం పరారీలో ఉన్నాడు. కాగా,

దొంగతనం ఆరోపణ.. పోలీసుల వివరణ

దొంగతనం ఆరోపణ.. పోలీసుల వివరణ


భయానక అల్లర్లు జరిగి ఏడాది పూర్తయినా ఈశాన్య ఢిల్లీలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రశాంతత నెలకొనలేదు. అంతలోనే పాక్ పేరుతో దాడి ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నది. అయితే, నిందితుడు గోస్వామికి చెందిన డైరీ ఫామ్ లోకి దూరి దొంగతనం చేయబోతుండగా సల్మాన్ పట్టుబడ్డాడని, అందుకే అతణ్ని కొట్టారనే ప్రచారం కూడా జరగ్గా, పోలీసులు దానిని ఖండించారు. సల్మాన్ దొంగతనం చేశాడని లేదా చేయడానికి ప్రయత్నించాడనిగానీ ఆధారాల్లేవని తెలిపారు. ఓవైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు స్నేహహస్తం అందిస్తోంటే, ఇటు ఢిల్లీలో అదే పాకిస్తాన్ పేరుతో దాడి జరగడం దారుణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

English summary
In a horrific video doing the rounds on social media, a man in Delhi’s Khajuri Khas was seen mercilessly thrashing another person as he forced him to chant “Hindustan Zindabad” and “Pakistan Murdabad” slogans. Taking note of the incident after the video went viral, a case was registered against the attackers. One of the accused was arrested, Delhi Police said late Wednesday night. As per reports, the man seen in the video is an accused in Delhi riots case that rocked the northeast area of the national capital in 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X