వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి నిద్రలేని రాత్రులే .. ఖలిస్తానీ గ్రూప్ బెదిరింపులు; యూఎస్ లో క్వాడ్ సదస్సుకు పీఎం

|
Google Oneindia TeluguNews

ఖలిస్తాన్ సంస్థ జస్టిస్ ఫర్ సిఖ్స్.. భారతదేశ ప్రధాని మోడీని అమెరికాలో నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తామని ప్రతిజ్ఞ చేసింది . క్వాడ్ లీడర్ సమ్మిట్ మరియు ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా వైట్ హౌస్ వెలుపల నిరసన కార్యక్రమాలకు ఖలిస్తాన్ గ్రూప్ ప్లాన్ చేసింది. తాము నిరసన తెలియజేయడానికి కారణం భారతదేశంలోరైతులపై కొనసాగుతున్న హింస అని ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఖలిస్తాన్ గ్రూప్ జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ సింగ్ పన్నన్, ప్రధాని మోడీకి అమెరికాలో నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తామని హెచ్చరించారు.

సోను సూద్ పై ఐటీ శాఖ తనిఖీలకు ఆ డీల్ కారణమా ? సూద్ ఆస్తులు, ఆదాయం, ఫౌండేషన్ పై హాట్ డిబేట్ !!సోను సూద్ పై ఐటీ శాఖ తనిఖీలకు ఆ డీల్ కారణమా ? సూద్ ఆస్తులు, ఆదాయం, ఫౌండేషన్ పై హాట్ డిబేట్ !!

 సెప్టెంబర్ 24 న క్వాడ్ దేశాల సదస్సు.. యూస్ వెళ్లనున్న పీఎం మోడీ

సెప్టెంబర్ 24 న క్వాడ్ దేశాల సదస్సు.. యూస్ వెళ్లనున్న పీఎం మోడీ

ఈనెల 24వ తేదీన క్వాడ్ దేశాల సదస్సు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరగనుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పాల్గొననున్నారు. భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత మోడీ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, కరోనా ను ఎదుర్కోవడానికి ప్రాక్టికల్ కోఆపరేషన్ ను మరింత అడ్వాన్స్ గా మార్చడం, వాతావరణ సంక్షోభం, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ స్పేస్ కు సంబంధించిన అనేక విషయాలు, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతంగా మార్చడం, వంటి 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనే అంశాలపై క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధానంగా చర్చించనున్నారు.

భారత్ లో రైతులపై హింసకు నిరసనగా మోడీని అడ్డగిస్తామన్న ఖలిస్తాన్ గ్రూపు

భారత్ లో రైతులపై హింసకు నిరసనగా మోడీని అడ్డగిస్తామన్న ఖలిస్తాన్ గ్రూపు

అయితే ఈ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఆయనను టార్గెట్ చేయనున్నారు ఖలిస్తాన్ గ్రూపు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై హింస పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలను జారీ చేస్తోంది. జస్టిస్ ఫర్ సిక్కులు అంటూ ఖలిస్తాన్ గ్రూపు. ఇప్పటికే వందలాది మంది మరణించిన పంజాబ్ రైతులపై భారతదేశం క్రూరమైన శక్తిని ప్రయోగించడంపై ఆందోళనకు పిలుపునిచ్చారు. వైట్ హౌస్ నుండి యుఎన్ వరకు పిఎం మోడీని అడ్డుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఖలిస్తాన్ టెర్రర్ బృందం తెలిపింది.

ఖలిస్తానీలపై దేశ ద్రోహం ఆరోపణలు చెయ్యటం, రైతులపై హింసకు వ్యతిరేకంగా మోడీ టార్గెట్

ఖలిస్తానీలపై దేశ ద్రోహం ఆరోపణలు చెయ్యటం, రైతులపై హింసకు వ్యతిరేకంగా మోడీ టార్గెట్

రైతులపై హింసను కొనసాగిస్తున్నందుకు, భారతీయ కాన్సులేట్లలో రైతు అనుకూల ర్యాలీలు నిర్వహించినందుకు భారతదేశంలో నేరారోపణలు దాఖలు చేయడం ద్వారా యుఎస్ పౌరుల వాక్ స్వేచ్ఛను అణచివేయడం చేసినందుకు, అలాగే భారతదేశం మరియు విదేశాలలో ఉన్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ ప్రచారకులపై దేశద్రోహం ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోడీ అడ్డగించబోతున్నామని జస్టిస్ ఫర్ సిఖ్స్ జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ ఒక ప్రకటనలో తెలిపారు.

క్వాడ్ దేశాల సదస్సుకు మోడీ హాజరు నేపధ్యంలో బెదిరింపులు

క్వాడ్ దేశాల సదస్సుకు మోడీ హాజరు నేపధ్యంలో బెదిరింపులు

ఎస్‌ఎఫ్‌జె సమస్యపై చర్చించడానికి ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఇటీవల ఢిల్లీలో పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నత వర్గాల సమాచారం. ముఖ్యంగా నిషేధిత ఖలిస్తాన్ సంస్థ పంజాబ్ యువతను విద్రోహ కార్యకలాపాల కోసం ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోందని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఏదేమైనా సెప్టెంబర్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొననున్న నేపథ్యంలో ఖలిస్తాన్ గ్రూప్ బెదిరింపులు చర్చనీయాంశంగా మారాయి.

English summary
The Khalistan organization Justice for Sikhs has vowed to make Indian Prime Minister Modi spend sleepless nights in America. The Khalistan Group plans to stage protests outside the White House during PM Modi's visit to the US to attend the Quad Leader Summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X