• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ : ఓటింగ్ కు ముందే -నేడే కీలక ఘట్టం..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు. పోటీలో ఇద్దరు నేతలు నిలిచారు. నేటి సాయంత్రం వరకు పోలింగ్ సాగనుంది. కానీ, గెలిచేదెవరో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ పదవి కోసం బరిలో నిలిచారు. కర్ణాటకకు చెందిన సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ పోటీలో నిలి చారు. దాదాపు 9100 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Kharge Vs Tharoor: Congress to elect its next chief Monday,polling will take place at all PCC offices

పోటీలో ఇద్దరూ దక్షిణాది నేతలే
ఏఐసీసీ ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలట్‌ విధానంలో ఓటింగ్ జరగనుంది. సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రకు నేడు విరామం ఇచ్చారు. కర్ణాటకలో రాహుల్ ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఎవరు నిలవాలనే అంశం పైన నామినేషన్ల దాఖలు సమయంలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలుత గెహ్లాట్ పోటీలో ఉండటం..గెలవటం ఖాయమని భావించారు. కానీ, ఒకే ఒక నిర్ణయం ఆయనను అధ్యక్ష నిర్ణయం నుంచి దూరం చేసింది. దిగ్విజయ్ సింగ్ తెర మీదకు వచ్చినా..చివరి నిమిషంలో దక్షిణాది నేత ఖర్గే ఎంట్రీతో సీన్ మారిపోయింది.

Kharge Vs Tharoor: Congress to elect its next chief Monday,polling will take place at all PCC offices

ఖర్గే కాబోయే అధ్యక్షుడిగా ప్రచారం
ఇప్పుడు ఇద్దరూ దక్షిణాది నేతలే అధ్యక్ష పోటీలో ఉన్నారు. కర్ణాటక కు చెందిన ఎస్సీ వర్గ నేత మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు గాంధీ కుటుంబం మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. అయిదున్నార దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్నారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శశి థరూర్ కుడా గాంధీ కుటుంబానికి విధేయుడే. కానీ, జీ-23లో నేతగా ఉండటం ఆయనకు ఈ ఎన్నికల సమయంలో ప్రతికూలంగా మారింది. పలు రాష్ట్రాల్లో ఆయన ఎన్నికల ప్రచారానికి సొంత పార్టీ నేతల నుంచే మద్దతు కరువైంది. ఐక్యరాజ్యసమితిలో సుదీర్ఘకాలం పనిచేసిన థరూర్‌.. మంచి వాక్చాతుర్యం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. అదేవిధంగా మనసులో ఏమీ దాచుకోరనే అభిప్రాయం ఉంది.

Kharge Vs Tharoor: Congress to elect its next chief Monday,polling will take place at all PCC offices

థరూర్ కు సీన్ అర్దమైపోయిందా
2009లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లండన్‌లో జన్మించిన థరూర్‌ ఉన్నత విద్యను అభ్యసించారు. ఇక, ఈ రోజు జరిగే ఎన్నికల్లో ఖర్గే ఎన్నిక లాంఛనమనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. దీంతో..థరూర్ కు పరిస్థితి అర్దమైంది. చివరి నిముషంలో యూటర్న్‌ తీసుకున్నారు. ఖర్గేతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేసారు. కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లు ఢిల్లీకి చేరనున్నాయి. ఈ నెల 19న కౌంటింగ్ జరగనుంది. దీంతో..గాంధీయేతర నేత ప్రధాని మోదీ హవా కొనసాగుతున్న వేళ..కాంగ్రెస్ పగ్గాలకు మరి కొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది.

English summary
The Congress is all set to vote to elect its next president, Voting will take place between 10 am and 4 pm on Monday, with the results to be declared on October 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X