• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఆయనేనా - తెర వెనుక..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరో క్లారిటీ వచ్చేస్తోంది. ఊహించని ట్విస్టుల నడుమ కాంగ్రెస్ అధ్యక్ష నామినేషన్ల ఘట్టం ముగిసింది. కాంగ్రెస్ హైకమాండ్ తెర వెనుక తమ విధేయుడికి పట్టం కట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి నుంచి రేసులో ప్రముఖంగా నిలిచిన గెహ్లాట్ రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాలతో తప్పుకున్నారు. ఆ తరువాత దిగ్విజయ్ నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. కానీ, నామినేషన్ల చివరి రోజు అనూహ్యంగా పరిణామాలు మారిపోయాయి. ఖర్గే తెర మీదకు వచ్చారు. నామినేషన్ దాఖలు చేసారు.

ఖర్గేకే పగ్గాలు అంటూ ప్రచారం

ఖర్గేకే పగ్గాలు అంటూ ప్రచారం

గాంధీ కుటుంబం ఆలోచన అర్దం చేసుకున్న పార్టీ నేతలు వరుసగా ఖర్గేకు మద్దతు ప్రకటిస్తూ ప్రకటనలు చేసారు. నామినేషన్ దాఖలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక, పార్టీ అధ్యక్షుడిగా గెలిచేదెవరో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. నామినేషన్ల సమయంలో అధ్యక్ష పదవికి ముగ్గురు రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన అనంతరం ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. కేఎన్ త్రిపాఠి నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి.

ఈ విషయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. అభ్యర్థుల నామపత్రాలు పరిశీలించిన మిస్త్రీ.. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మాత్రమే బరిలో ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు పోటీ ఖర్గే వర్సస్ థరూర్ గా మారింది.

రేసులో ఖర్గే వర్సస్ థరూర్

రేసులో ఖర్గే వర్సస్ థరూర్

ఖర్గే 14 దరఖాస్తులు దాఖలు చేయగా, థరూర్ ఐదు, త్రిపాఠి ఒక దరఖాస్తు సమర్పించారని చెప్పారు. త్రిపాఠిని బలపరిచిన వ్యక్తి సంతకం సరిపోలేదని వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు సమయం ఉంది. ఆ తర్వాత బరిలో ఉండేది ఎవరో తేలిపోనుంది. అక్టోబర్ 8న సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు.

థరూర్, ఖర్గేలలో ఎవరు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 9వేలకు పైగా కాంగ్రెస్ సభ్యులు ఎన్నికల్లో ఓటేస్తారు. అక్టోబర్ 19న కౌంటింగ్ ఉంటుంది. అదేరోజు విజేతను ప్రకటిస్తారు. అయితే, ఈ నెల 8వ తేదీ వరకు సమయం ఉండటంతో, థరూర్ చివరి నిమిషంలో ఆలోచన మార్చుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

థరూర్ అడుగులపై ఆసక్తి

థరూర్ అడుగులపై ఆసక్తి

ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా తర్వాత ట్వీట్ చేసిన థరూర్.. స్నేహపూర్వక పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రజాస్వామ్యయుత ప్రక్రియ పార్టీకి, నేతలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే విషయం స్పష్టం కావటంతో..ఆయన గెలుపు లాంఛనంగా మారుతోంది. ఇదే సమయంలో ఒక వ్యక్తి ఒకే పదవి అనే ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ తీర్మానానికి కట్టుబడి రాజ్యసభలో విపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా చేసారు.

English summary
veteran Congressmen Mallikarjun Kharge and Shashi Tharoor emerged as the two final names who will race for the post of Congress president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X