బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: భార్యతో జల్సాలు చెయ్యాలని ఆశ, విమానంలో బెంగళూరు వచ్చి, లేడీస్ తో ?, హైదరాబాద్ లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ లో ఎక్కువగా చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. ఒంటరిగా వెలుతున్న మహిళలు, వాకింగ్ చేస్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కొని పారిపోతున్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, మఫ్టీలో పోలీసులు రంగంలోకి దిగి చైన్ స్నాచింగ్ లు చేస్తున్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు తిరుగుతున్న బైక్ చోరీకి గురైన వాహనం అని పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కిన యువకుడు రాజస్థాన్ కు చెందిన వాడు. ఇతను విమానంలో ఆ రోజు ఐటీ హబ్ వచ్చాడని పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడి జోబులో మూడు బంగారు గొలుసులు ఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు రాజస్థాన్ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చి చైన్ స్నాచింగ్ లు చేస్తున్నాడని, భార్యతో ఎంజాయ్ చెయ్యడానికి, విలాసవంతమైన జీవితం గడపడానికి చైన్ స్నాచింగ్ లు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భార్య ఆనందం కోసం, ఆమెతో విహారయాత్రలకు తిరగాలని ఆశపడుతున్న యువకుడు అదే భార్య విషయంలో గతంలో జైలు శిక్షకూడా అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. నిందితుడి మీద బెంగళూరులో, హైదరాబాద్ లో, రాజస్థాన్ లో డజన్లు కొద్ది కేసులు నమోదు అయ్యాయని పోలీసులు అంటున్నారు.

Illegal affair: ఫేమస్ పాన్ మసాలా బిజినెస్ మెన్ భార్య, భర్తకు పాన్ మసాలా, పనోడికి మిడ్ నైట్ మసాలా!Illegal affair: ఫేమస్ పాన్ మసాలా బిజినెస్ మెన్ భార్య, భర్తకు పాన్ మసాలా, పనోడికి మిడ్ నైట్ మసాలా!

 బెంగళూరులో హడలిపోతున్న మహిళలు

బెంగళూరులో హడలిపోతున్న మహిళలు

బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో ఎక్కువగా చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. ఒంటరిగా వెలుతున్న మహిళలు, వాకింగ్ చేస్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కొని పారిపోతున్న నిందితులను పట్టుకోవడానికి బెంగళూరు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులు రంగంలోకి దిగి చైన్ స్నాచింగ్ లు చేస్తున్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

 పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు

పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు

బెంగళూరులో అనుమానాస్పదంగా బైక్ లో తిరుగుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు తిరుగుతున్న బైక్ చోరీకి గురైన వాహనం అని పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కిన యువకుడు రాజస్థాన్ కు చెందిన ఉమేష్ ఖతిక్ అలియాస్ ఉమేష్ అని పోలీసులు గుర్తించారు.

 రాజస్థాన్ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చాడు

రాజస్థాన్ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చాడు

ఉమేష్ విమానంలో ఆ రోజు ఐటీ హబ్ బెంగళూరు వచ్చాడని పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు ఉమేష్ జోబులో మూడు బంగారు గొలుసులు ఉండటంతో వాటిని బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు ఉమేష్ రాజస్థాన్ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చి చైన్ స్నాచింగ్ లు చేస్తున్నాడని వెలుగు చూసింది.

 భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఆశ

భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఆశ

ఉమేష్ అతని భార్యతో ఎంజాయ్ చెయ్యడానికి, విలాసవంతమైన జీవితం గడపడానికి బెంగళూరు వచ్చి చైన్ స్నాచింగ్ లు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భార్య ఆనందం కోసం, ఆమెతో విహారయాత్రలకు తిరగాలని ఆశపడుతున్న ఉమేష్ కు చాలా ఫ్లాష్ బ్యాక్ ఉందని పోలీసులు అంటున్నారు.

 భార్య కోసం జైలుకు వెళ్లిన కేటుగాడు

భార్య కోసం జైలుకు వెళ్లిన కేటుగాడు

ఉమేష్ పెళ్లి చేసుకున్న మహిళ కేసులో గతంలో జైలుపాలైనాడని పోలీసులు అన్నారు. మైనర్ గా ఉన్న సమయంలో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడని, తరువాత ఫోక్స్ చట్టం కింద అదే భార్య విషయంలో జైలు శిక్షకూడా అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

 హైదరాబాద్ లో కేసులు

హైదరాబాద్ లో కేసులు

నిందితుడు ఉమేష్ బెంగళూరులో చైన్ స్నాచింగ్ లు చేసుకుని తరువాత హైదరాబాద్ వెళ్లి అక్కడ కూడా చైన్ స్నాచింగ్ లు చేసి తరువాత రాజస్థాన్ పారిపోతున్నాడని పోలీసులు అన్నారు. నిందితుడు ఉమేష్ మీద బెంగళూరులో 7 కేసులు, హైదరాబాద్ లో 8 కేసులు, రాజస్థాన్ లో 18 చైన్ స్నాచింగ్ లు, చోరీల కేసులు పెండింగ్ లో ఉన్నాయని బెంగళూరు పోలీసులు తెలిపారు.

English summary
Khiladi: Chain snatching case, Rajasthan husband arrested in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X