Khiladi: మొదటి నుంచి అదే డౌట్, అర్దరాత్రి భార్యను చంపేసి వాడే వెళ్లి కేసు పెట్టాడు, సార్ అంతే !

బెంగళూరు/ మంగళూరు: భార్య మీద మొదటి నుంచి అదే డౌట్.... అదే అనుమానంతో నిత్యం ఆమెతో భర్త గొడవపడుతున్నాడు. నా భార్యను ఎలాగైనా చంపేయాలని కొంతకాలం నుంచి భర్త స్కెచ్ లు వేస్తూనే ఉన్నాడు. గుట్టుచప్పుడు కాకుండా అర్దరాత్రి భార్యను చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని వాడే వెళ్లి కేసు పెట్టి నాటకాలు ఆడాడు. నా భార్య మానసికంగా అస్వస్థతకు గురైయ్యిందని, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదని, అదే ఫీలింగ్ ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త స్వయంగా వెళ్లి పోలీసు కేసు పెట్టి అడ్డంగా బుక్కైపోయాడు.

 దంపతులది ఒకే రాశి

దంపతులది ఒకే రాశి

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కముటా తాలుకాలోని ఉప్పినపట్టణంలో మంజునాథ శనభాగ (38), మమతా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం అయిన తరువాత కొన్ని సంవత్సరాలు మంజునాథ్, మమతా దంపతులు చాలా సంతోషంగానే ఉన్నారు. మంజునాథ్, మమతా ఇద్దరి రాశి ఫలాలు ఒక్కటే కావడంతో పోట్లాడుకోవటం, ఒక్కరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఒకరిని మంచి ఒకరు తయారైనారు. తరువాత ఒకరి మద్య ఒకరికి మాటాపట్టింపులు ఎక్కువ అయ్యాయని సమాచారం.

 మొగుడు అనుమానం పిచాచి

మొగుడు అనుమానం పిచాచి

మమతా తీరుతో మంజునాథ్ అనుమానం పెంచుకున్నాడు. తాను బయటకు వెళ్లిన తరువాత మమతా ఎవరితోనో మాట్లాడుతుందని, నేను బయట పనిమీద ఉన్న టైమ్ లో మమతా బయటకు వెళ్లి జల్సా చేసి వస్తోందని మంజునాథ్ అనుమానం పెంచుకున్నాడు. భార్య మమతా మీద ఆమె భర్త మంజునాథ్ కు రానురాను అనుమానం పెరిగిపోయింది.

 భార్యను చంపేయాలని స్కెచ్

భార్యను చంపేయాలని స్కెచ్

మమతాతో నిత్యం పదేపదే గొడవపడుతున్న మంజునాథ్ కు ఏమాత్రం అనుమానం తగ్గలేదు. ఎలాగైనా తన భార్యను చంపేయాలని మంజునాథ్ కొంతకాలంగా స్కెచ్ వేస్తూనే ఉన్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లిన మంజునాథ్ అతని భార్య మమతాతో మళ్లీ పాత విషయంలో గొడవపడ్డాడు.

 చంపేసి వాడే వెళ్లి కేసుపెట్టాడు

చంపేసి వాడే వెళ్లి కేసుపెట్టాడు

అర్దరాత్రి గొడవ తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన మంజునాథ్ భార్య మమతాను గొంతుపిసికి చంపేశాడు. నేను నా భార్యను చంపేశానని బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని మంజునాథ్ పాత సినిమా స్కెచ్ వేశాడు. భార్య మమతా మెడను టవల్ తో బిగించి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి వెళ్లి పోలీసు కేసు పెట్టాడు.

 నా భార్యకు మతిస్థిమితం లేదు సార్.... .అందుకే ఆత్మహత్య

నా భార్యకు మతిస్థిమితం లేదు సార్.... .అందుకే ఆత్మహత్య

తన భార్య మమతా చాలా కాలంగా మానసిక అస్వస్థతతో భాదపడుతోందని, ఆమెకు ఆర్యోగం సహకరించకపోవడంతో ఆవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త మంజునాథ్ పోలీసుల ముందు నాటకాలుఆడాడు. అయితే తన అక్క మమతాను మా బావ మంజునాథ్ హత్య చేశాడని ఆరోపిస్తూ భార్య తమ్ముడు దామోదర్ పోలీసు కేసు పెట్టాడు. పోలీసుల విచారణలో తన భార్య మమతాను తానే హత్య చేశానని కిలాడీ కేటుగాడు మంజునాథ్ అంగీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+