ఖుష్బు సుందర్‌కు కీలక పదవి: ప్రధాని మోడీకి థ్యాంక్సంటూ ట్వీట్
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)లో సభ్యురాలిగా ఖుష్బును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఖుష్బు సుందర్‌కు ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)లో సభ్యురాలిగా ఖుష్బును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ పదవిలో ఖుష్బు మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
ఖుష్బుతోపాటు మరో ఇద్దరు మహిళా నేతలు మమతా కుమారి, డెలినా ఖోంగ్‌డుప్ కూడా జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా నియమించారు. తనను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఖుష్బు సుందర్ ధన్యవాదాలు తెలిపారు. తనకు కీలక బాధ్యతలను అప్పగించారని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని అన్నారు.

దేశంలోని మహిళల రక్షణ కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఖుష్బు సుందర్ స్పష్టం చేశారు. మహిళల హక్కుల రక్షణ కోసం పనిచేస్తానని అన్నారు. మహిళల కోసం పోరాడుతున్న ఖుష్బు సుందర్‌కు జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా నియమించడాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై స్వాగతించారు. ఆమెకు అభినందనలు తెలిపారు.
I thank our H'ble PM @narendramodi ji and the government of India for entrusting me with such a huge responsibility. I shall strive hard to protect, preserve & nourish Nari Shakthi which is growing leaps & bounds under your leadership. Looking forward eagerly. #JaiHind@NCWIndia pic.twitter.com/Tm5GTJPEDe
— KhushbuSundar (@khushsundar) February 27, 2023
తమిళనాడు బీజేపీ తరపున ఖుష్బుకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, అక్టోబర్ 2020లో ఖుష్బు సుందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం బీజేపీలో జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications