• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మసాలాల రారాజు -మనం రోజూ చూసే ఎండీహెచ్ అధినేత ఇకలేరు -చదివింది 5.. జీతం రూ.21కోట్లు

|

ఇండియాలోనేకాదు, వంటలో మసాలాలు వాడే ప్రతి దేశానికి ఆయన ముఖం చిరపరిచయం. తన బ్రాండ్లకు ఆయనే అంబాసిడర్. దేశవిభజనతో పొట్ట చేతపట్టుకొని వచ్చి.. ఢిల్లీ గల్లీలో చిన్న దుకాణంగా మొదలై.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. 100కుపైగా దేశాలకు తన ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తూ.. దేశంలోనే అత్యధిక జీతం పొందే సీఈవోగా రికార్డు నెలకొల్పి.. సంపాదనలో 90 శాతాన్ని పేదల కోసమే ఖర్చుపెట్టాడు.. కింగ్ ఆఫ్ స్పైసెస్(మసాలాల రారాజు)గా ముద్రపడి, సామాజిక సేవలోనూ ముందున్న ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూాడా లభించింది.

జగన్ గాడిదలు కాస్తున్నాడా? కేంద్రాన్ని ఒప్పించాడా? -పోలవరం ఘనత వైఎస్సార్‌దికాదు: చంద్రబాబు

మసాలా కింగ్ కన్నుమూత

మసాలా కింగ్ కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత భారతీయ మసాలా(స్పైసెస్‌) బ్రాండ్‌ ‘మహాషియాన్‌ ది హట్టి (ఎండీహెచ్‌)' సంస్థ అధినేత మహాశయ్‌ ధరమ్‌పాల్‌ గులాటి(98) కన్నుమూశారు. నవంబర్ 26న ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆయనను ఢిల్లీలోని ఛన్నాన్ దేవి ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం గులాటికి మరోసారి తీవ్ర గుండెపోటుకు రావడంతో తుది శ్వాస విడిచారు. భారతీయ వ్యాపార, సామాజిక రంగాల్లో ప్రముఖుడిగా వెలుగొందిన ధరమ్‌పాల్‌ మృతిపై కీలక నేతలు సంతాపాలు తెలిపారు. గల్లీలో చిన్న కొట్టుతో జీవితాన్ని ప్రారంభించిన ఆయన గాథను దేశం స్మరించుకుంటున్నది.

స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

‘‘ధరమ్‌పాల్‌ వ్యక్తిత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సమాజ సేవకై తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి'' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాళులు అర్పించగా, ‘‘దేశంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్త, ఎండీహెచ్‌ యజమాని ధరమ్‌పాల్‌ మహాశయ్‌ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన లాంటి మంచి మనసున్న మనిషిని నేనెప్పుడూ చూడలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'' అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో చాందినీ చౌక్ నుంచి ‘ఎండీహెచ్' విస్తరణ మొదలైందిలా..

జగన్‌కు బీజేపీ భారీ షాక్ -ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఎంపీ సురేశ్ ప్రభు ఫిర్యాదు -సంచలన లేఖలు

చదివింది 5.. జీతం రూ.21కోట్లు..

చదివింది 5.. జీతం రూ.21కోట్లు..

మహాశయ్‌ ధరమ్‌పాల్‌ 1923లో అవిభాజ్య పాకిస్తాన్ సియాల్‌కోట్‌ లో జర్మించారు. ఐదో తరగతిలోనే చదువు మానేసిన ఆయన.. తండ్రి చున్నీలాల్‌ గులాటి మసాలా దినుసుల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవారు. 1947లో దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చేసింది. ఉన్నదంతా అక్కడే వదిలేయడంతో, ఢిల్లీ చేరాక కొంతకాలంపాటు ధరమ్‌పాల్‌ గుర్రపు బండ్లు నడిపారు. తర్వాత బియ్యం, సబ్బులు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు మొదలుపెట్టారు.

ఇక 1953లో ఢిల్లీలోని చాందినీ చౌక్‌ కేంద్రంగా ‘మహాషియాన్‌ ది హట్టి (ఎండీహెచ్‌)' బ్రాండ్ మసాలా దినుసుల వ్యాపారాన్ని పున:ప్రారంభించారు. నిజానికి ఈ కంపెనీకి సియాల్ కోట్ లో ఉన్నసమయంలోనే(1919) చున్నీలాల్ అంకురార్పరణ చేశారు. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌(ఎఫ్ఎంసీజీ) రంగంలో అత్యధిక వేతనం పొందిన(రూ. 21 కోట్లు) భారత సీఈఓగా ఆయన రికార్డు సృష్టించారు.

  Cyclone Nivar Effect in Chittoor కల్యాణి డ్యామ్‌కు వరద.. ఉప్పొంగుతున్న భీమ,స్వర్ణముఖి...!!
  సంపాదనలో 90 శాత సేవకే..

  సంపాదనలో 90 శాత సేవకే..

  మసాలాల వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎండీహెచ్ ను రూ.2000 కోట్ల టర్నోవర్‌ గల సంస్థగా మలచి, ‘కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్'‌గా ధరమ్‌పాల్‌ ఖ్యాతి గడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ పదం పుట్టకముందు నుంచే సామాజిక సేవలో ముందున్న ఆయన.. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో 20కిపైగా స్కూళ్లు ఆస్పత్రులను నడిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1000 మందికిపైగా డీలర్లను భాగస్వాములుగా చేసుకుని 15 ఫ్యాక్టరీలు నెలకొల్పారు. తన జీతం నుంచి 90 శాతం డబ్బును స్వచ్ఛంద సంస్థలకే కేటాయించేవారాయన. ధరమ్‌పాల్‌ ‘ఎండీహెచ్' కంపెనీ వ్యవహారాలను ప్రస్తుతం ఆయన కొడుకులు, కూతుళ్లు చూసుకుంటున్నారు. ధరమ్‌పాల్‌ గులాటీని గతేడాది ‘పద్మ భూషణ్' పురస్కారంతో కేంద్రం సన్మానించింది.

  English summary
  'Mahashay’ Dharampal Gulati, the owner and CEO of the iconic spice masala brand MDH (Mahashian Di Hatti), passed away on Thursday at the age of 98. Known as the ''The king of spices'', Dharampal Gulati, was undergoing treatment at Mata Chanan Devi Hospital in Delhi for the last three weeks. His condition deteriorated on Wednesday night and he passed away on Thursday morning because of cardiac arrest.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X