వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానస సరోవరంలో తెలుగు యాత్రికుల కష్టాలు.. కిషన్ రెడ్డి చొరవ.. హెలికాప్టర్‌లో తరలించే ప్రయత్నం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రమంలో మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను కాపాడే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారిని రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్ లోని భారత ఎంబసీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు.

కిషన్ రెడ్డి ఆదేశాలతో అధికారుల్లో చలనం మొదలైంది. ఆ మేరకు ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా మానస సరోవరంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను నేపాల్ రాజధాని ఖాట్మండుకు సురక్షితంగా తరలించే పనిలో నిమగ్నమయ్యారు.

Recommended Video

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ : కిషన్ రెడ్డి
kishan reddy helps to telugu tourists who hold in manasa sarovar

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అడ్డదారులు.. ఇతరుల పరీక్షలు రాస్తూ బుక్కైన భార్యాభర్తలుప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అడ్డదారులు.. ఇతరుల పరీక్షలు రాస్తూ బుక్కైన భార్యాభర్తలు

ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌కు చెందిన 40 మంది మానస సరోవరం యాత్రకు బయలుదేరారు. అనుకోని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్నారు. బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయాయి. దాంతో గత ఐదు రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు. సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు చైనా నేపాల్ బోర్డర్‌లో చిక్కుకుపోయారు.

అదలావుంటే తాము సదరన్ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగితే ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. మానస సరోవరం యాత్రలో భాగంగా తాము చైనా నేపాల్ బోర్డర్‌లో చిక్కుకున్నామని.. వెంటనే రక్షించే ఏర్పాట్లు చేయాల్సిందిగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఏమి చేయాలో పాలుపోక చివరకు ఓ వీడియో సందేశం రికార్డు చేసి కుటుంబ సభ్యులకు పంపించడంతో విషయం కాస్తా బయటి ప్రపంచానికి తెలిసింది. అది కాస్తా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ మేరకు వారిని రక్షించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

English summary
Central Home Affairs Minister Kishan Reddy will take care about Telugu Tourists who hold in manasa sarovar tour. He ordered the officials to protect them. The Officials provide helicopters to rescue them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X