కిషన్ రెడ్డికి కరోనా అవాస్తవం..ఆరోగ్యంగా విధుల్లో కేంద్రమంత్రి
హైదరాబాదు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకినట్లుగా వచ్చిన వార్తల్లో నిజంలేదు. ఆయన అపోలో పరీక్ష చేయించుకున్నారని పాజిటివ్‌గా వచ్చిందంటూ ప్రచురితమైన కథనం వాస్తవదూరం. కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఢిల్లీలో తన విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే సమాచార, సమన్వయలోపంతో వన్‌ఇండియా తెలుగులో ఈరోజున పొరపాటున ప్రచురితమైన కథనానికి చింతిస్తున్నాం. కిషన్ రెడ్డి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని వన్‌ఇండియా టీమ్ మనసారా కోరుకుంటోంది.
ఈ కథనం రాసిన సిబ్బందిపై విచారణ కొనసాగుతోంది. అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మంత్రి ఆరోగ్యం గురించి తొందరపాటుతో రాసిన కథనాన్ని ఉపసంహరించుకుంటున్నాం. అదే సమయంలో ఇలాంటి పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నాం. మరోసారి ఇలాంటి అవాస్తవ కథనాలకు దూరంగా ఉంటామని హామీ ఇస్తున్నాం.













Click it and Unblock the Notifications