వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిస్ ఆఫ్ లవ్ విఫలం, అందరు చూస్తుండగా ముద్దులు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళలో వివాదాస్పద కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించబూనుకున్న నిర్వాహకులను, వారి మద్దతుదారులను ఆదివారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎర్నాకులం న్యాయ కళాశాల నుంచి మెరైన్ డ్రైవ్ మైదానానికి ప్రదర్శనగా వెళ్తున్న వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

సుమారు 50మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి సమస్య తలెత్తినా ఎదుర్కొనేందుకు మైదానంలో, చుట్టుపక్కలా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు.

అయితే ఈ కార్యక్రమం గురించి మీడియాలో బాగా ప్రచారం కావడంతో ఈ కార్యక్రమాన్ని తిలకించాలనుకునే వారు, కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్వాహకులు చివరి నిముషంలో సాయంత్రం 4.30 గంటలకు ఎర్నాకుల న్యాయ కళాశాల నుంచి ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.

Kiss of love protest: When passions ran high

దీంతో పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, శివసేన, కేరళ విద్యార్థి సంఘం జిల్లా శాఖ, ఇతర ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం వేర్వేరుగా ప్రదర్శనలు సాగాయి.

ఇది ముద్దుల పండుగ కాదని, నైతిక విలువలను కాపాడడమనే పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి (మోరల్ పోలీసింగ్) వ్యతిరేకంగా అవగాహనను పెంపొందించడానికి భావసారూప్యం కలిగిన వ్యక్తుల కలయిక మాత్రమేనని నిర్వాహకులు చెప్పారు.

కాగా, వీహెచ్‌పీ కార్యకర్తల మోరల్ పోలీసింగును నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఈ వేడుకకు వేయిమంది వస్తారని భావించారు. అయితే ప్రచారం హోరెత్తడంతో పాల్గొనే జంటలకన్నా ఈ వింత చూద్దామని వచ్చిన వారితో మైదానం కిక్కిరిసింది. దీంతో నిర్వాహకులు ఈ వేడుక రద్దయిందని ప్రకటించి... సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

English summary
The ‘Kiss of Love’ protestors made a strong impression about the need for an open and tolerant society despite being far outnumbered by a slew of organisations affiliated to various religious outfits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X