షాక్: పదేళ్ళ క్రితం లోక్ సభలో ఏడ్చారు, నేడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: పదేళ్ళ క్రితం లోక్ సభలో వెక్కి వెక్కి ఏడ్చిన ఓ ఎంపి, ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.తప్పుడు కేసులు బనాయించి తనపై ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును యోగి ఆదిత్యనాథ్ లోక్ సభలో ప్రస్తావించి భావోద్వేగానికి గురయ్యారు.

2007లో అప్పటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ పై ఉన్న కేసులను పునర్విచారణ జరిపించి 11 రోజుల పాటు గోరఖ్ పూర్ జైల్లో ఉంచారు.జైలు శిక్షణను అనుభవించిన తర్వాత లోక్ సభకు హజరైన యోగి ఆదిత్యనాథ్ లోక్ సభలో తన పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించారు.

భారత్ నేపాల్ సరిహద్దులో జరుగుతున్న ఉగ్ర కుట్రలు, అవినీతిపై యోగి ధ్వజమెత్తుతున్నారన్న కారణంగా అప్పటి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యోగిపై కేసులను పునర్విచారణ చేసింది.

2007 మార్చి12వ, తేదిన లోక్ సభకు హజరైన యోగి ఆదిత్యనాథ్ లోక్ సభలో మాట్లాడారు. జీరో అవర్ లో ఈ విషయమై ఆదిత్యనాథ్ మాట్లాడారు. తనతో పాటు మరో 14 మంది బిజెపి మద్దతుదారులను అకారణంగా అరెస్టు చేయించారని ఆయన చెప్పారు.

yogi adityanath

మాటల మద్యలో మాకు ఇక్కడ రక్షణ లభిస్తోందా లేక సునిల్ మహతోని జంషేడ్ పూర్ లో చంపేశారు. ఈ ఘటనను ఉదహరిస్తూ ప్రభుత్వం తనకు ఎలాంటి భద్రత కల్పించకపోతే లోక్ సభ్యుడిగా ఉన్నా అర్థం లేదన్నారు యోగి.బావోద్వేగానికి గురైన యోగి లోక్ సభలో ఏడ్చారు.

ఈ విషయాలను విన్న ఆనాటి స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ విచారణ నిర్వహిస్తామని హమీ ఇచ్చారు.2014 నాటికి మోడీ, రాజ్ నాథ్ తర్వాత ఇతర అభ్యర్థులకు ప్రచారం చేయగల ఏకైక నేతగా ఎదిగారు.2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడ చూపించారు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
yogi adityanath who is seen as a hardcore hindutva face, once cried in parliament on the issue of police brutality in the state. This war in2007 when mulayam singh yadav was the chief minister of the state.
Please Wait while comments are loading...