అత్యాచారం ఎలా జరిగిందో బొమ్మ గీసిన బాలిక, నిందితుడికి ఐదేళ్ల శిక్ష

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్ కత్తా: తనపై జరిగిన అత్యాచారం ఘటనను ఓ బాలిక బొమ్మలు వేసి చూపించింది. ఈ బొమ్మల ఆధారంగా నిందితులకు కోర్టు శిక్ష వేసింది.నిందితుడికి ఐదేళ్ళపాటు శిక్ష విధించింది.

నిలువ నీడ ఇచ్చాననే ధీమాతో ఓ వ్యక్తి 8 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ అత్యాచారానికి సంబందించి ఎలాంటి సాక్ష్యాలు లేవనే నిందితుడు సంబంరంలో ఉన్న సమయంలోనే కోర్టు అనుహ్యంగా తీసుకొన్న నిర్ణయం నిందితుడికి జైలు శిక్ష పడేలా చేసింది.

 kolkata court ordered to Akter five years jail for rape

కోల్ కత్తాకు చెందిన ఓ బాలిక ఢిల్లీలోని తన మామయ్య అక్తర్ అహ్మద్ ఇంటిలో ఉండి చదువుకొంటోంది. రెండేళ్ళ క్రితం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఆరోపణలతో అక్తర్ ను గత ఏడాది జూన్ లో అరెస్టు చేశారు పోలీసులు.అయితే ఈ అత్యాచారం కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడు తప్పించుకొనే అవకాశం ఉందని పోలీసులు బావించారు.

విచారణలో భాగంగా కోర్టులో బాలికకు ఓ పేపర్ క్రేయాన్లు ఇచ్చి ఏం జరిగిందో బొమ్మ గీసి చూపించమన్నారు. బాలిక తనపై జరిగిన అత్యాచారం తీరును కళ్ళకు కట్టినట్టు బొమ్మ గీసీ చూపించింది. దీంతో నిందితుడికి కోర్టు ఐదేళ్ళ శిక్ష విధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
kolkata court ordered to Akter five years jail.10 year old girl drawn a picture, court punished Akhtar with this witness.
Please Wait while comments are loading...