శాంతియుతంగా ఉండలేనోళ్లకు ఎన్నికలెందుకు ? రద్దు చేసేస్తాం-హైకోర్టు వార్నింగ్..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఓవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం ఎంతకైనా తెగించేస్తున్నాయి. ఇదే క్రమంలో పశ్చిమబెంగాల్లో ఎలాగైనా ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ, టీఎంసీ తాజాగా శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న మతఘర్షణలను రాజకీయంగా వాడుకునేందుకు చూస్తున్నాయి. ఈ క్రమంలో కోల్ కతా హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
బెంగాల్లోని ముర్షీదాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో 19 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోల్ కతా హైకోర్టు ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముర్షీదాబాద్ జిల్లాలో ఘర్షణలు చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతిని కాపాడలేని ప్రజలకు ఎన్నికలు కోరుకునే హక్కు లేదని కోల్ కతా హైకోర్టు అభిప్రాయపడింది.

శాంతియుతంగా ఉండలేని వారికి ప్రజాప్రతినిధి ఎందుకని కోల్ కతా హైకోర్టు ప్రశ్నించింది. అంతే కాదు ఇదే పరిస్దితి కొనసాగితే ముర్షీదాబాద్ లో ఎన్నికలు రద్దు చేస్తామని హెచ్చరించింది. కోల్ కతాలో 33 చోట్ల శ్రీరామనవమి వేడుకలు జరిగినా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, ముర్షీదాబాద్ లోనూ గతంలో ఎప్పుుడూ ఇలా జరగలేదని హైకోర్టు తెలిపింది. ఈసారి బయట వ్యక్తుల ప్రమేయంతోనే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు భావిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఘర్షణలు రెచ్చగొట్టిన వ్యక్తుల వివరాలు ఎల్లుండి లోగా ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications