Kolkata: ఆర్జీకర్ ఘటన మరువక ముందే కోల్‌కతాలో మరో దారుణం

Kolkata: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశంలోని ప్రజలను కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువక ముందే కోల్‌కతాలో మరో దారుణం చోటచేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని కస్బాలోని ఒక లా కళాశాలలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలోనే నిందితులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటన కస్బాలోని కళాశాల ప్రాంగణంలోనే జరిగినట్లు కోల్‌కతా పోలీసులు వెల్లడించారు. సామూహిక అత్యాచారానికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. లా కాలేజీ పూర్వ విద్యార్థితో పాటు ఇద్దరు ప్రస్తుత విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 25 రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 10.50 గంటల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కస్బా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Kolkata Law Student Gangrape Shocks City 3 Accused Arrested

నిందితుల్లో కళాశాల మాజీ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్(TMCP) మాజీ యూనిట్ అధ్యక్షుడు అయిన 31 ఏళ్ల మోనోజిత్ మిశ్రా, 19 ఏళ్ల జైబ్ అహ్మద్, 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ అలియాస్ ప్రమిత్ ముఖోపాధ్యాయ ఉన్నారని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. నిందితుల్లో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్ ఇద్దరిని జూన్ 26 సాయంత్రం కోల్‌కతాలోని తాల్‌బాగన్ క్రాసింగ్ సమీపంలో సిద్ధార్థ శంకర్ శిశు రాయ్ ఉద్యానం ముందు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మూడో నిందితుడు ప్రమిత్ ముఖర్జీని జూన్ 27న తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో అతని నివాసం నుండి అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో పురోగతి
ఈ ఘటన కాలేజీ భవనం లోపలే జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి. అనేక మంది సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయబడ్డాయి. నేరం జరిగిన ప్రదేశాన్ని సురక్షితంగా ఉంచారు. ఆ ప్రాంతంలో ఫోరెన్సిక్ పరీక్ష చేయనున్నారు. ముగ్గురు నిందితులను గురువారం అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను 14 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు వారిని వచ్చే మంగళవారం వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది.

రాజుకున్న రాజకీయ రచ్చ
ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత మీద రాజకీయ రచ్చ రాజుకుంది. ఈ ఘటనపై స్పందిస్తూ.. పశ్ఛిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి పూర్తిగా పోలీసులే బాధ్యులు అంటూ మండిపడ్డారు. సీఎంకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా ఓ పోస్టులో ఈ ఘటనను భయానకం అని పేర్కొన్నారు. ఈ నేరానికి మాజీ విద్యార్థి, ఇద్దరు కళాశాల విద్యార్థులు పాల్పడ్డారని.. ఒక టీఎంసీ సభ్యుడికి కూడా ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఆర్‌జీకర్ ఆసుపత్రి ఘటనను ప్రస్తావిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని "మహిళలకు పీడకల"గా మార్చిందని మాలవీయ ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూస్తుందని ఆయన తెలిపారు.

కోల్‌కతాలో విద్యార్థినిపై అత్యాచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీలో కూడా ఒక విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. తరువాత నిందితుడు సంజయ్ రాయ్‌కి సియాల్‌దహ్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అతనికి రూ.50 వేల జరిమానా కూడా విధించారు. కేసు జరిగిన 164 రోజుల తర్వాత దోషి సంజయ్ రాయ్‌కి శిక్ష పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+