మదర్సాలో జాతీయగీతం పాడమన్నందుకు దాడి
కోల్‌కతా: నగరంలోని తల్పుకూర్ ఆరా ఉన్నత మదర్సాలో ఖాజీ మసూమ్ అక్తర్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని పాడాలని విద్యార్థులకు ఆయన సూచించాడు. అంతే, ఆయనపై మౌలానాలు, వారి అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
కాగా, దాడికి పాల్పడిన మౌలానాలకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న ముద్ర కూడా ఉంది. ఇది ఇలా ఉండగా, తనపై దాడి గురించి అక్తర్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్‌ను ఆరుసార్లు కలిసినా ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు.
ఇప్పటికే మౌలానాలు అక్తర్‌కు వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేశారు. అంతేగాక, జాతీయగీతం దైవ దూషణేనని, అది హిందుత్వ గీతమని వారు ఆరోపించారు.

అక్తర్‌పై ఇనుపరాడ్లతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన కొన్ని నెలలపాటు ఆస్పత్రి మంచానికే పరిమితమయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడైనప్పటికీ అక్తర్‌ను మదర్సాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఫత్వా జారీ చేశారు మౌలానాలు.
ముస్లిం వస్త్రాలైన కుర్తా, పైజామా ధరించి.. గడ్డాన్ని పెంచితేనే ఆయనను మదర్సాలోకి అనుమతిస్తామని, గడ్డం ఎంతవరకు పెంచాలనేది కూడా మౌలానాలే నిర్ణయిస్తారని ఫత్వాలో పేర్కొన్నారు. గడ్డం పెరుగుదల గురించి ప్రతివారం ఫొటోలు పంపుతూ తమకు సమచారం అందించాలని ఆదేశించారు.
కాగా, ఇంత జరుగుతున్నా.. మత ఉద్రిక్తతల కారణంగా అక్తర్‌కు భద్రత కల్పించలేమంటూ కోల్‌కతా పోలీస్ కమిషనర్.. మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌కు లేఖ రాయడం గమనార్హం. దాడి జరిగిన నాటి నుంచి తాను మదర్సాకు వెళ్లలేదని, ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అక్తర్ కోరారు.
అక్తర్.. గత కొంతకాలంగా ముస్లిం బాలికల విద్యను ప్రోత్సహించడంతోపాటు ముస్లింలలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. అంతేగాక, ముస్లింలు బాలికలను వృద్ధులైన ముస్లింలకు ఇచ్చి వివాహం చేయడం సరికాదని ప్రచారం చేస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications