వివాహేతర సంబంధం: భార్యపై యాసిడ్ దాడి

పోలీసుల కథనం ప్రకారం.. తన కుమారుడు జిల్లాలోని హబ్రా ఆస్పత్రిలో అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతుండటంతో అతడ్ని చూసేందుకు అతడి తండ్రి, నిందితుడు గౌతం మండల్ అక్కడికి చేరుకున్నాడు.
వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను తన భార్యపై పోశాడు.
ఆమె పక్కనే ఉన్న ఇద్దరు నర్సులపై కూడా ఆ యాసిడ్ పడటంతో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
వివాహేతర సంబంధం కారణంగానే గౌతం మండల్ అతని భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వేధింపులు: ఇద్దరు యువతుల ఆత్మహత్య
చండీఘర్: ఆకతాయిలు తరచూ వేధింపులకు పాల్పడంతో మనస్తాపానికి గురైన ఓ ఇద్దరు యువతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ జిల్లాలో సోమవారం జరిగింది. ఓ యువతి తన సూసైడ్ నోట్‌లో తమను వేధింపులకు గురి చేసిన ఆకతాయి పేరు రాసింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు యువతులు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ తరగతులు చదువుతున్నారని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications