'శోభనం వీడియోలు పోర్న్ సైట్ లో అప్ లోడ్.. ఎక్స్- లవర్ తో నా బాడీని కంపేర్ చేస్తూ'.. ఈ నవ వధువు మాటలు వింటే..

కొత్తగా పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంతో కాపురం మొదలు పెట్టిన ఆ నవ వధువుకు భర్త చుక్కలు చూపించాడు. వరకట్నం పేరుతో పెళ్లయిన వారం రోజుల నుంచే భర్త నుంచి అత్తమామల నుంచి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. అత్తింటివారి తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు తాళలేక కొల్లామ్ లోని నీందకారా ప్రాంతానికి చెందిన అంజు అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తమామ, భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్ లో అంజు పేర్కొన్న విషయాలను బట్టి చూస్తే.. నాలుగు నెలల క్రితం అంజు- నందులకు వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన వారం రోజుల నుంచే ఆమెపై అత్తింటి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. అదనపు కట్నం కోసం తనను మానసిక, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లు అంజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక తన మాజీ ప్రియురాలి బాడీతో నందు తనను కంపేర్ చేసి అవమానించేవాడని అంజు తెలిపింది.

వివాహం అయిన నెల రోజుల తర్వాత నందు సౌదీ అరేబియా వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ లో నిత్యం దూషించేవాడు.. అయితే ఆ వేధింపులు తట్టుకోలేక అంజు తన పుట్టింటికి వెళ్లింది. దాంతో అత్తమామలు ఆమెపై ప్రేమ ఉన్నట్లుగా నటించి మళ్లీ తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సౌదీలో ఉన్న భర్త వద్దకు వెళ్లింది అంజు. అయితే అక్కడ కూడా ఆమెకు తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులు ఎదురయ్యాయి. తాను అనేకమందితో శృంగారం జరిపినట్లు ఒప్పుకోవాలని తనకు నందుతో విడాకులు తీసుకుని సెక్స్ రాకెట్ ను నిర్వహించాలన్న కోరిక ఉందని ఒప్పుకోవాలని నందు తనపై ఒత్తిడి తెచ్చినట్లు అంజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఈ మాటలన్నీ మాట్లాడించి అందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ ను స్థానికులు, కుటుంబ సభ్యులకు పంపించినట్లు ఎఫ్ఐఆర్ లో అంజు పేర్కొంది.

Kollam videos uploaded to a porn site comparing my body to exlover hearing this new bride s words

అంతేకాక నందు తనను చేతికి ఏది దొరికితే దాంతో కొట్టేవాడని పెస్టిల్, ప్రెజర్ కుక్కర్, లాప్ టాప్ ఛార్జర్ ఏది పక్కన ఉంటే దాంతో దాడి చేసేవాడని పేర్కొంది. తన శరీరంపై అనేక గాయాలున్నట్లు తెలిపింది. తనను ఓ చెడ్డ మహిళగా అందరూ అనుకునేలా వ్యవహరించాలని కత్తితో నందు తనను బెదిరించేవాడని అంజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+