డీప్లీ డిస్టర్బ్డ్: తేలిగ్గా తీసుకోకూడదు- చిరంజీవి

వీడియో మార్ఫింగ్ పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర మూవీలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్- జాన్వీకపూర్ చుట్టమల్లే.. పాట ఆధారంగా కొందరు ఆకతాయిలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఓ అసభ్యకర మార్ఫింగ్ వీడియోను సృష్టించారు. దీన్ని ఎన్టీఆర్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోనని అన్నారు.

ఈ ఉదంతంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అధునాతన ఉపయోగించి ఒక మహిళను అత్యంత హేయంగా చిత్రీకరించడం తీవ్రంగా కలచివేస్తోందని అన్నారు. ఏఐతో మార్ఫింగ్ చేసిన ఇలాంటి వీడియోలను సృష్టించడం, వాటిని షేర్ చేయడం అమానుషమని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఉదంతం.. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సినిమాకో పరిమితమైన సమస్య కాదని, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని పేర్కొన్నారు.

Chiranjeevi Pushes Action Against Those Creating Sharing Amplifying Deepfake Content Chuttamalle

ఈ పరిస్థితి రేపు మీకు, నాకు, ఎవరికైనా ఎదురుకావొచ్చని, ఒకరి గౌరవానికి భంగం కలుగుతుంటే మనకెందుకులే అని మౌనంగా ఉండటానికి వీల్లేదని చిరంజీవి చెప్పారు. దీన్ని అరికట్టడంలో మనందరికీ బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని, వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న వారిని చట్టపరంగా జవాబుదారీ చేయాలని, వీటిని సరదాగానో, వినోదంగానో తీసుకొని తేలికగా వదిలేయలేమని చెప్పారు.

తమిళనాడు పీసీసీ హెడ్ క్వార్టర్ లో షర్మిల- భర్త అనిల్ ను వెంటబెట్టుకుని మరీ.. !!
తమిళనాడు పీసీసీ హెడ్ క్వార్టర్ లో షర్మిల- భర్త అనిల్ ను వెంటబెట్టుకుని మరీ.. !!

ఈ సమస్యపై తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సంఘాలతో మాట్లాడి, ఒక ప్రత్యేక కమిటీని, ఫిర్యాదులపై చర్యలకు సమన్వయం చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తానని చిరంజీవి తెలిపారు. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలవడం, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేలా చర్యలు చేపట్టడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ఈ విభాగం లక్ష్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఆ కమీనే గాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: నిప్పులు చెరిగిన జూనియర్ ఎన్టీఆర్
ఆ కమీనే గాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: నిప్పులు చెరిగిన జూనియర్ ఎన్టీఆర్

దీనికోసం తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలని, అసోసియేషన్లు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులు, అందరం సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి వీడియోలను చూడకండి, షేర్ చేయకండి. వాటిని మళ్లీ పోస్ట్ చేయకండి.. అని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+