అయోద్యలోనే పుట్టిన కొరియన్ మహారాణి
లక్నో :కొరియన్ మహారాణి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోద్యలో జన్మించారని కొరియన్లు నమ్ముతారు. అందుకే పెద్ద సంఖ్యలో కొరియన్లు అయోద్యను సందర్శిస్తుంటారు.మహరాణికి గుర్తుగా ఆలయాన్ని నిర్మించాలని కొరియన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నారు.
ప్రతి ఏటా దక్షిణ కొరియ నుండి వందలాది మంది అయోద్యకు వస్తుంటారు.అయోద్యలోనే కొరియన్ మహారాణి జన్మస్థలమని వారు నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా కొరియన్లు అయోద్కు వస్తుంటారు.కరక్ వంశాన్ని స్థాపించిన కొరియన్ల మహరాజు కిమ్ సురో. ఆయన సతీమణి హార్ వాంగ్ ఒక్. ఈమెను సురిరత్న అని కూడ పిలుస్తారు. వాంగ్ పుట్టినిల్లు అయోద్య అని కొరియన్లు విశ్వసిస్తారు.
క్రీ.శ 48 లో పడవ ద్వారా దక్షిణ కొరియాకు వెళ్ళి గమ్ వాన్ గయ అనే రాజ్యాన్ని స్థాపించిందని వారు నమ్ముతున్నారు.కిమ్ సురోను పెళ్ళాడిన తర్వాత పది మంది పిల్లలకు ఆమె జన్మనిచ్చింది.వీరి నుండే కరక్ వంశం ఆవిర్భవించిందని కొరియన్లు నమ్ముతారు.ఈ నమ్మకం ఆదారంగా కొరియన్లు అయోద్యకు వస్తుంటారు.

వాంగ్ ఒక్ 157 ఏళ్ళు బతికిందని కొరియన్లు చెబుతుంటారు. కొరియన్ మహారాజుకు భార్య దొరకడం లేదని, దేవుడు కలలో కన్పించి చెప్పడంతో ..అతని కలుసుకోవాలని దేవుడు ఆదేశించడంతో ఒక్ కొరియాకు వెళ్ళిందని వారు చెబుతుంటారు.తమ తెగకు చెందిన తొలి మహారాణి అయోద్యలో పుట్టిందని, అక్కడి నుండే రాయిని తీసుకెళ్ళి ఆమె సమాదిని కట్టారు.
ఒక్ సమాధిపై ఈ అంశాన్ని రాశారు .దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన ప్రదానమంత్రి నరేంద్రమోడీని కొరియన్లు అయోద్యలో వాంగ్ ఒక్ కు ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరింది అక్కడి ప్రభుత్వం.ఉత్తర్ ప్రదేశ్ సిఎం ను కూడ కొరియన్లు ఈ మేరకు ఆళయం గురించి అభ్యర్థించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications