కోలార్ కోటిలింగేశ్వర మహిళా ఆఫీసర్‌ని వెంటాడి, కత్తితో దాడి

బెంగళూరు: కర్నాటకలోని కోలార్ జిల్లా కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. ఓ మహిళా అధికారిణి పైన రౌడీ మూక కత్తులతో దాడి చేసింది. ఆమె భయంతో పరుగు తీసినా వెంటబడి మరీ ఆమె పైన కత్తులతో దాడి చేశారు.

Kotilingeshwara temple secretary attacked with talwar

సీసీ కెమెరాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇది స్థానికంగా కలకలం రేపింది. కోలార్ జిల్లాలోని కోటిలింగాల దేవాలయంలో కుమారి సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆమె పైన నిన్న రాత్రి సంతోష్ అనే రౌడీ ఆమె పైన తల్వార్‌తో దాడి చేశారు.

ఈ ఘటనలో ఆమెకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అందరు చూస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. అతని నుంచి తప్పించుకునేందుకు ఆమె పరుగెత్తినా లాభం లేకపోయింది. ఆమె మెడ పైన గాయాలయ్యాయి. ఆమె కోమాలోకి వెళ్లింది. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉంది. 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+