కోజికోడ్ విమాన ప్రమాదం .. మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్ కు రెస్క్యూ టీం

కోజికోడ్ విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేసి, విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా క్వారంటైన్ కి వెళ్లాలని, అందరూ టెస్ట్ లు చేయించుకోవాలి అని కేరళ ప్రభుత్వం సూచించింది.

Recommended Video

    Kozhikode : మరణించిన 18 మంది ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్! || Oneindia Telugu

     కేరళ విమాన ప్రమాద ఘటనలో మరో సంఘటన

    కేరళ విమాన ప్రమాద ఘటనలో మరో సంఘటన

    కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పై జరిగిన ప్రమాదంలో విమానం రెండు ముక్కలు అయింది . దుబాయ్ నుంచి 190తో ఉన్న ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం లోయలో పడిపోయి ఇద్దరు పైలట్లతో సహా 19 మంది ప్రయాణికులు మరణించారు.137 మంది క్షతగాత్రులయ్యారు . 15 మంది పరిస్థితి విషమంగా ఉంది . ఈ ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలంలో ఉన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది, స్థానికులు, పోలీసులు, ఫైట్, మీడియా సిబ్బంది, వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాద ఘటనలో మరో సంఘటన ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతుంది.

     మృతుల్లో ఒకరికి కరోనా ... సహాయకచర్యల్లో పాల్గొన్న వారికి క్వారంటైన్

    మృతుల్లో ఒకరికి కరోనా ... సహాయకచర్యల్లో పాల్గొన్న వారికి క్వారంటైన్

    కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానం ద్వారా దుబాయ్ నుండి కేరళకు ప్రయాణికులను తరలిస్తున్నారు. అయితే అనుకోకుండా విమాన ప్రమాద విషాదం చోటు చేసుకుంది. అంతేకాదు విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

    స్పందించిన కేరళ సర్కార్ .. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి

    స్పందించిన కేరళ సర్కార్ .. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి

    సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి కేరళ ఆరోగ్య మంత్రి కే కే శైలజ ధన్యవాదాలు తెలిపారు. ముందు జాగ్రత్తగా సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లాలని ఆమె సూచించారు. అంతేకాకుండా విమానంలో ప్రయాణించిన మిగతా ప్రయాణికులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెస్క్యూలో పాల్గొన్న వారందరికీ సమాచారం ఇవ్వాలని వారంతా ఆరోగ్య విభాగం టోల్‌ఫ్రీ నంబర్‌లను సంప్రదించాలని మంత్రి కేకే శైలజ పేర్కొన్నారు . ఆరోగ్య శాఖ సహాయక చర్యల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+