• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటీ ఇదీ క్షమాబింధు.. ఇలా చేస్తావా..? ఏం చేసిందంటే.. మహారాణినంటూ..?

|
Google Oneindia TeluguNews

భారతదేశం... సనాతన సాంప్రదాయాలకు వేదిక.. భిన్న సంస్కృతుల సమ్మేళనం.. ఆచారాలు, వ్యవహారాలలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. మంచి పేరు గడిస్తోంది. కానీ కొత్తదనం పేరుతో కొందరు చేసే చర్యలు అభాసు పాలుకావడానికి దారితీస్తోంది. గుజరాత్‌కు చెందిన క్షమాబిందు ఇలాంటి పనే చేశారు. అవును తనకు తాను పెళ్లి చేసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. వద్దు ఇలా చేయొద్దు అని చెప్పినా.. వినిపించుకోలేదు.

 ఎన్ని అడ్డంకులు వచ్చినా..?

ఎన్ని అడ్డంకులు వచ్చినా..?


క్షమబిందు వివాహాంపై బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయంలో చేసేందుకు కూడా అనుమతి లేదు. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. తన సన్నిహితులు, హితుల మధ్య ఇంట్లోనే పెళ్లి తంతు చేసుకుంది. ఒక్కతే.. ఉండి కల్యాణం చేసుకుంది. వినడానికి వింతగా ఉన్న ఇదీ మాత్రం నిజం.. అంతేకాదు తనను విష్ చేసినవారికి థాంక్స్ చెప్పింది. మేసెజ్ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

మూస పద్దతులు వీడాలని..

మూస పద్దతులు వీడాలని..


పెళ్లి గురించి క్షమ బిందు చెబుతూ.. మూస పద్దతులను వీడనాడాలని అనుకున్నానని వివరించారు. నిజమైన ప్రేమను కనుగొనడంలో అలసిపోయానని చెప్పారు. తాను చేసిన ఈ పని వల్ల ఇతరులకు స్ఫూర్తిగా నిలువాలని అనుకున్నానని పేర్కొన్నారు. ఇలా ఒక్కరే కల్యాణ తంతు చేసి.. దేశంలో తొలి వ్యక్తిగా క్షమా బిందు నిలిచారు.

 మహారాణినంటూ..

మహారాణినంటూ..


తానే మహారాణినని క్షమాబిందు చెప్పుకొచ్చారు. తనకు రాజు అక్కర్లేదు అని చెప్పారు. తనకు పెళ్లి రోజు కావాలి.. కానీ మరుసటి రోజు అవసరం లేదన్నారు. అందుకోసమే జూన్ తాను ఈ నెల 11వ తేదీన పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని చెప్పారు. కానీ ఘర్షణకు దారితీస్తోందనే అనుమానంతో ముందే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురిలా తయారై.. ఆచార సాంప్రదాయాల మధ్య వివాహా వేడుక జరగనుంట.. అంతేకాదు పెళ్లి తర్వాత తాను వరుడి ఇంటికి వెళ్లాలని అనుకోవడం లేదని.. తన ఇంటికే రావాలని అనుకున్నానని చెప్పారు.

 పురోహితుడు బుక్

పురోహితుడు బుక్


పెళ్లి కోసం ఇప్పటికే పురోహితుడిని బుక్ చేశానన వివరించారు. అయితే దేశంలో స్వ వివాహాలపై క్లారిటీ లేదు. అందుకోసమే ట్రెండ్ సెట్ చేద్దామని ఇలా చేశానని వివరించారు. కానీ కొందరికీ తన ఆలోచనలు అంటే నచ్చవని చెప్పారు. అంతేకాదు తాను చేసింది.. ముమ్మాటికీ కరెక్టే అని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జరిగిన, జరుగుతున్న వివాహాలు ఎందుకు విడాకులకు దారితీస్తున్నాయని అడిగారు. తాను కూడా గతంలో ఓ పురుషుడు, ఓ స్త్రీని ప్రేమించానని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం తనకే తానే అన్నీ అని చెబుతున్నారు. కానీ ఆమె వివాహాం చట్టబద్దం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.

 అవకాశం లేదు

అవకాశం లేదు


భారతదేశ చట్ట ప్రకారం.. సొంతంగా పెళ్లి చేసుకునేందుకు అవకాశం లేదు. ఇద్దరు కలిసే వివాహాం చేసుకోవాలని సనాతన ఆచారాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. క్షమాబిందు వివాహం చెల్లదని అంటున్నారు.

English summary
kshama bindu finally kept her promise to herself and entered into a marital bond in a ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X