వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70మందిని కాపాడి మృతి చెందిన కన్నడ డ్రైవర్

|
Google Oneindia TeluguNews

ఊటి: తనకు ఓ వైపు గుండెపోటు వచ్చినప్పటికీ బస్సులోని ప్రయాణికులను రక్షించాలనే తపనతో వారిని కాపాడి తన ప్రాణాలను కోల్పోయాడు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కెఎస్ఆర్టీసి)కు చెందిన ఓ బస్సు డ్రైవర్. ఈ ఘటన కేరళలోని సుల్తాన్ నుంచి కోయంబత్తూరు మీదుగా వెళ్తుండగా చోటు చేసుకుంది.

డ్రైవర్ అబ్దుల్ రహమాన్(50) బస్సు నడుపుతుండగా తమిళనాడులోని నీలగిరిస్లోని నీలకొట్టాయి దగ్గర ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. దీంతో అతడు కొంత సమయం తీసుకుని రహదారి పక్కనే ఉన్న ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. బస్సులోని ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

గమనించిన ప్రయాణికులు అతడ్ని వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సుల్తాన్ బతేరీలోని మరో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి వైద్యులు అప్పటికే రహమాన్ మృతి చెందాడని నిర్ధారించారు.

KSRTC bus driver dies after saving 70 passengers

బావిలో పడిన సింహాన్ని వెలికి తీశారు

జునాఘడ్: అడవి నుంచి బయటికి వచ్చిన ఓ సింహం ప్రమాదవశాత్తు బావిలో పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ సింహాన్ని సురక్షితంగా బయటికి తీశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ నగర సమీపంలో చోటు చేసుకుంది.

జునాగఢ్ అమరాపూర్ గ్రామంలోని 60 అడుగుల లోతున్న ఓ వ్యవసాయ బావిలో సింహం పడి ఉండడాన్ని గుర్తించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సింహాన్ని తాళ్ల సహాయంతో సురక్షితంగా బావి నుంచి బయటకు తీశారు. ఏడు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న ఈ సింహాన్ని అడవిలోకి వదిలేశారు.

English summary
A Kerala State Road Transport Corporation (KSRTC) bus driver, who suffered an apparent cardiac failure, saved the lives of 70 passengers on a bus heading towards Coimbatore from Sulthan Bathery in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X