మేమంతా ఒక్కటి: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్ల ఆఫర్ చేసింది, గవర్నర్ వద్దకు కుమారస్వామి
Recommended Video

బెంగళూరు: బీజేపీ నేత యడ్యూరప్పకు గట్టి షాక్. జేడీఎస్ నేత రేవణ్ణతో పాటు ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని యడ్యూరప్ప బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం రేవణ్ణ జేడీఎస్ అధినేత కుమారస్వామితో కలిసి మీడియా ముందుకు వచ్చారు. మేమంతా ఒకటేనని ఈ సందర్భంగా రేవణ్ణ ప్రకటించారు. జేడీఎస్‌లో ఎలాంటి చీలిక లేదన్నారు.
జేడీఎస్ నుంచి రేవణ్ణ వర్గం చీలుతుందన్న ఊహాగానాలకు కుమారస్వామితో కలిసి వచ్చి ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ సందర్భంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. తనను జేడీఎస్ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. మత విద్వేషాలు రెచ్చకొట్టి బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందిందని చెప్పారు. లౌకికవాదం కోసమే తాము కాంగ్రెస్ పార్టీతో కలవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

లౌకికవాద ఓట్లు చీలిపోవడంతో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ వైపు వస్తే రూ.100 కోట్లు ఇస్తామని చెప్పారని చెప్పడం కలకలం రేపేలా ఉంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నల్లధనం వినియోగిస్తోందని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ సంస్థలతో తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారన్నారు. కర్నాటకలో బీజేపీ గెలుపు మోడీ గెలుపు కాదన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతిచ్చేది లేదన్నారు. అధికారం కోసం బీజేపీ తహతహలాడుతోందన్నారు. బీజేపీని నిరోధించేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు.
This is a bogus news. No Javadekar, no BJP leader has met me till now: HD Kumaraswamy, on being asked if he had met BJP Karnataka in-charge Prakash Javadekar. #KarnatakaElections2018 pic.twitter.com/PU06JWfKHc
— ANI (@ANI) May 16, 2018
బీజేపీ యాత్ర ఉత్తరాదిన ప్రారంభమైందని, కానీ దక్షిణాన కర్ణాటకలో ఆగిపోయిందని కుమారస్వామి వ్యాఖ్యానించారు. బీజేపీ ఆపరేషన్ కమలను ఆపేయాలని, వారు ఒక్కరిని తీసుకుంటే మేం ఇద్దరిని తీసుకోగలమని, బీజేపీని వీడాలనుకునే వారు తమతో కలిసి రావాలని కుమారస్వామి పిలుపునిచ్చారు. గవర్నర్ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నామని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
గోవా, మణిపూర్, మేఘాలయలలో అత్యధిక స్థానాలు లేకున్నా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కుమారస్వామి చెప్పారు. కాగా, ఆయన గవర్నర్‌ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లారు.












Click it and Unblock the Notifications