వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభకు ఆర్థిక సర్వే.. బడ్జెట్‌కు ముందు ఆనవాయితీ.. అందులో ఏముంటుంది?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలుత సభ ముందుకు రానుంది ఆర్థిక సర్వే. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవి సుబ్రమణియన్ గురువారం నాడు లోక్‌సభకు సమర్పించనున్నారు. అయితే 2019-20 కాలానికి రైతులకు, వ్యవసాయానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు ఉండే ఛాన్సుందనే టాక్ వినిపిస్తోంది. ఆహార ఉత్పత్తులకు మద్దతు ధరలు తదితర అంశాలు పరిశీలనలోకి రానున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ఈ సర్వేలో ప్రధానాంశాలుగా కనిపించనున్నాయి. అయితే కొత్త ప్రభుత్వంలో తొలి ఆర్థిక సర్వేను సభలో మొదటిసారిగా ప్రవేశపెట్టేందుకు ఎదురుచూస్తున్నా అంటూ సుబ్రమణియన్‌ ట్వీట్‌ చేశారు.

KV Subramanian to table Economic Survey in Parliament on thursday

లక్కీ అంటే అదే.. 430కి కొంటే 6 కోట్లు వచ్చాయి..!లక్కీ అంటే అదే.. 430కి కొంటే 6 కోట్లు వచ్చాయి..!

గడచిన సంవత్సరంలో దేశంలో జరిగిన ఆర్థిక అభివృద్ధి, గవర్నమెంట్ విధానాల వల్ల వచ్చే రిజల్స్ట్ ప్రతిబింబించేదే ఆర్థిక సర్వే. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థకు సంబంధించిన విషయాలను ఈ నివేదిక స్ప‌ష్టంగా వెల్ల‌డిస్తుంది. అయితే అందులో పొందుపరిచిన అంశాలను బేస్ చేసుకుని బడ్జెట్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

ఆర్థిక సర్వే ద్వారా ప్రభుత్వం ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలి. పాలసీల పరంగా ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉండాలి. పోయినేడాది ఏ మేర డెవలప్‌మెంట్ జరిగింది. తదితర విషయాలను ప్రస్ఫుటపరుస్తుంది ఆర్థిక సర్వే.

English summary
Chief Economic Adviser KV Subramanian will table the new Narendra Modi government's first Economic Survey in Parliament on Thursday. Looking forward with excitement to table my first and the new Governments first Economic Survey in Parliament on Thursday, he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X