వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు నెలలపాటు యువతిపై స్కూల్ టీచర్ రేప్: ఐదేళ్ల బాలికపైనా..

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో దారుణ దారుణం చోటు చేసుకుంది. లక్నోలోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వ్యక్తి.. అదే పాఠశాలలోని యువతిపై రెండు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, గర్భం దాల్చిన ఆ యువతిని అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు.

ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిందిత ఉపాధ్యాయుడు ఆర్‌సి తివారీ(47) కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గోమతినగర్ ప్రాంతంలోని ఆ పాఠశాలలో పని చేస్తున్నాడు. గత డిసెంబర్ నుంచి ఆ యువతిని అదనపు తరగతుల పేరిట పిలిపించుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

గర్భం దాల్చిన యువతికి జనవరి 10న బలవంతంగా అబార్షన్ చేయించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఇందుకు సహకరించిన నిందితుడి భార్య, ఇద్దరు మహిళా వైద్యులు విజయ్ శ్రీ, అషక సిద్ధిఖిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

 KV teacher sexually exploits Std 12 student, forces abortion

నిందిత ఉపాధ్యాయుడు తివారీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తివారీ భార్యను, ఇద్దరు వైద్యులను కూడా కస్టడీకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, తివారీని డిస్మిస్ చేయాలని ఉన్నతాధికారులను కోరినట్లు పాఠశాల అధికారులు తెలిపారు.

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాన్ స్టీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె బంధువైన 17ఏళ్ల బాలుడే ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఒత్తిడి వల్ల బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని తొలుత బయటికి చెప్పలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకొని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

English summary
A 12th grade student of a Lucknow-based Kendriya Vidyalaya was allegedly sexually exploited for two months by her school teacher, who also forced her to terminate a pregnancy, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X