Ladakh-Kargil elections: బీజేపీకి షాక్, మెజార్టీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్-ఎన్సీ
లడఖ్: కొద్ది రోజుల క్రితం కార్గిల్‌లో జరిగిన లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 26 స్థానాలకు అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించగా.. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు జరిగింది. ఇప్పటి వరకు 21 స్థానాలకు ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 18 స్థానాల్లో విజయం సాధించింది.
ఈ 18 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ దక్కించుకోగా.. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలుపొందింది. ఇక బీజేపీ మాత్రం కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు తర్వాత తొలిసారి నిర్వహించిన కీలక ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. మొత్తం 28 స్థానాలకు గానూ 85 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మరో ఐదు స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

పది సంవత్సరాల తర్వాత లడఖ్-కార్గిల్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో తమ ఇండియా కూటమి భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి అధిక సీట్లు సాధించినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రజల్లో విశ్వాసం నింపిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ విజయం లడఖ్, కార్గిల్‌లలో నూతన ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తుందని విశ్వసిస్తున్నట్లు వేణుగోపాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications