ఫుల్ జోష్ లో బీజేపీ.. 501 కిలోల లడ్డూలు ఆర్డర్..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోగింగ్ ముగిసింది. ఫలితాలు ఈ నెల 14న విడుదల కానున్నాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. దీంతో కాషాయపార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నెల 14 న ఫలితాలు వెల్లడైన వెంటనే సంబరాలు చేసుకునేందుకు పట్నాలో 501 కిలోల లడ్డూలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఓ బీజేపీ నేత మాట్లాడుతూ.. ఫలితాల రోజు తాము దసరా, దీపావళి, హోలీ, ఈద్ పండగలు జరుపుకుంటామని తెలిపారు. ఎన్డీయే కూటమి అభివృద్ధి ఫలాలకే ప్రజలు జై కొట్టారని పేర్కొన్నారు. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఖండించారు. తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఓ సారి గమనిస్తే.. బిహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 140 నుంచి 160 సీట్లు గెలుచుకుంటుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక మహాగఠ్ బంధన్ కు మాత్రం 100లోపే సీట్లు ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థలు వివరిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీయే కూటమికి 133- 159 సీట్లు వస్తాయని పేర్కొంది. మహాగఠ్బంధన్ కు 75- 101 మధ్యలో సీట్లు రావచ్చని తెలిపింది. ఇక దైనిక్ భాస్కర్ సర్వే.. ఎన్డీయూకు 145-160 సీట్లు.. మహాగఠ్బంధన్ కు 73-91 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే చాణక్య స్ట్రాటజీస్ సంస్థ.. ఎన్డీయే కు 130- 138 సీట్లు అలాగే మహాగఠ్బంధన్ కు 100- 108 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.

ఇక జేవీసీ పోల్స్ సర్వే చూస్తే.. ఎన్డీయేకు 135- 150 సీట్లు అలాగే మహాగఠ్బంధన్ కు 88- 103 సీట్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. ఇక బిహార్ లోని 243స్థానాలు ఉండగా ఈనెల 6వ తేదీన 121స్థానాలకు తొలివిడత పోలింగ్ జరిగింది. ఈ నెల 11న మిగిలిన స్థానాలకు రెండో విడత పోలింగ్ పూర్తయింది. ఈ నెల 14 న తుది ఫలితాలు విడుదల కానున్నాయి.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications