Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, ఫ్రెండ్స్ తో విహారయాత్రకు వెళ్లిన యువతి, బాత్ రూమ్ లో శవమైంది!

బెంగళూరు/ ముంబాయి/ కొడుగు: చాలా కాలం తరువాత పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ఇంతకాలం పర్యాటక కేంద్రాలు బోసిపోయాయి. ఇప్పుడు పర్యాటక కేంద్రాలు విహారయాత్రకు వచ్చేవారితో కలర్ ఫుల్ గా కనపడుతున్నాయి. విహారయత్రకు వచ్చిన యువతి సంతోషంగా ఆపరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది. ముంబాయిలో ఉద్యోగాలు చేస్తున్న ఫ్రెండ్స్ తో ఆ యువతి స్నేహితులతో కలిసి పర్యాటక కేంద్రలోని ఓ ప్రముఖ హోమ్ స్టేలో బస చేసింది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిద ప్రాంతాల్లో తిరిగిన ఆ యువతి తరువాత హోమ్ స్టేకి చేరుకుంది. హోమ్ స్టేలోని బాత్ రూమ్ లో ఆ యువతి అనుమానాస్పద స్థతిలో శవమై కనిపించడం కలకలం రేపింది. హోమ్ స్టే యజమాని సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఆ యువతి ఏలా చనిపోయింది ? అనే విషయం అంతుచిక్కకపోవడంతో సాటి పర్యాటకులు హడలిపోయారు.

 కిటకిటలాడుతున్న పర్యాటక కేంద్రాలు

కిటకిటలాడుతున్న పర్యాటక కేంద్రాలు

చాలా కాలం తరువాత పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ఇంతకాలం పర్యాటక కేంద్రాలు బోసిపోయాయి. ఇప్పుడు పర్యాటక కేంద్రాలు విహారయాత్రకు వచ్చేవారితో కలర్ ఫుల్ గా కనపడుతున్నాయి.

బళ్లారి అమ్మాయి.... ముంబాయి ఫ్రెండ్స్

బళ్లారి అమ్మాయి.... ముంబాయి ఫ్రెండ్స్

కర్ణాటకలోని బళ్లారికి చెందిన విఘ్నేశ్వరి ఈశ్వర్ అలియాస్ విఘ్నేశ్వరి (24) అనే యువతి ఆమె ఐదు మంది స్నేహితులతో కలిసి మూడు రోజుల క్రితం కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పర్యటించడానికి వెళ్లింది. స్నేహితులతో కలిసి విఘ్నేశ్వరి చాలా సంతోషంగా, ఉత్సాహంగా కొడుగు చేరుకుంది.

 హోమ్ స్టేలో బస చేసిన ఫ్రెండ్స్

హోమ్ స్టేలో బస చేసిన ఫ్రెండ్స్

కొడుగు జిల్లాలోని మడికేరిలోని న్యూ కూర్గ్ వ్యాలీ హోమ్ స్టేలో విఘ్నేశ్వరి ఆమె స్నేహితులు బసచేశారు. విఘ్నేశ్వరితో పాటు ఆమెతో వచ్చిన వారు ముంబాయిలోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మడికేరి పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాల్లో విఘ్నేశ్వరి, ఆమె స్నేహితులు సంచరించారు.

బాత్ రూమ్ లో శవమైన యువతి

బాత్ రూమ్ లో శవమైన యువతి

రాత్రి స్నానం చెయ్యాలని బాత్ రూమ్ లోకి వెళ్లిన విఘ్నేశ్వరి చాలా సేపు బయటకు రాలేదు. తరువాత బాత్ రూమ్ లోనే విఘ్నేశ్వరి శవమై కనిపించింది. పక్కరూమ్ ల్లో ఉన్న విఘ్నేశ్వరి స్నేహితులు విషయం గుర్తించి హడలిపోయారు. హోమ్ స్టే యజమాని ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఎవరెవరు వచ్చారు?

ఎవరెవరు వచ్చారు?

విఘ్నేశ్వరి చాలా ఉత్సాహంగా ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో సంచరించిందని, ఆమె ఆరోగ్యంగానే ఉందని సాటి స్నేహితులు చెప్పారని పోలీసులు అంటున్నారు. అయితే బాత్ రూమ్ లో ఆమె ఎందుకు చనిపోయింది అనే విషయం పోస్టుమార్టం నివేదికలోనే కచ్చితంగా తెలుస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు. విఘ్నేశ్వరితో పాటు అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు ఎవరైనా వచ్చారా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విహారయాత్రకు వెళ్లిన విఘ్నేశ్వరి శవమై కనిపించడం మడికేరిలో కలకలం రేపింది. విఘ్నేశ్వరి అనుమానాస్పదంగా బాత్ రూమ్ లో శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+