Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

actress: తాళిబొట్టు అంటుంది, నకిలి నగలతో నాటకాలు ఆడుతున్న నటి, సీసీటీవీల్లో ? !

చెన్నై: మహిళ వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయ్యింది. టీవీ సిరియల్స్ లో ఆమె నటిస్తోంది. స్కూటర్ మీద రోజు బయట తిరుగుతున్న ఆమె బంగారు నగలు కుదవపెట్టే షాపు దగ్గరకు వెళ్లింది. షాపు యజమానికి మంగళసూత్రం ఇచ్చిన మహిళ తనకు కొంచెం డబ్బులు కావాలని అడిగింది. అతని దగ్గర కొంచెం డబ్బులు తీసుకుని మరుసటి రోజు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చి మిగిలిన డబ్బులు తీసుకుని వెలుతానని చెప్పింది. రెండు రోజులు అయినా మహిళ రాకపోవడంతో గెరివి షాపు యజమాని మంగళసూత్రం రుద్ది చూడగా అది నకిలి అని వెలుగు చూసింది. సిటీలో చాలా మందికి కిలాడీ లేడీ కుచ్చుటోపి పెట్టిందని వెలుగు చూసింది.

 మంగళసూత్రం ఇచ్చింది

మంగళసూత్రం ఇచ్చింది

చెన్నైలోని పెరంబూర్ పటేల్ రోడ్ లో కన్నయ్య లాల్ జైన్ అనే వ్యక్తి పాన్ షాప్ నడుపుతూ బంగారు నగలు కుదవపెట్టుకుని డబ్బులు ఇస్తున్నాడు. ఫిబ్రవరి 24న నగలను తాకట్టు పెట్టేందుకు ఓ మహిళ అతని దుకాణానికి వెళ్లింది. వైద్యం కోసం అత్యవసరంగా డబ్బులు అవసరం కావడంతో తన తాళిబొట్టు కుదువపెడుతున్నానని కన్నయ్య లాల్ జైన్ కు చెప్పి ఆ తాళి అతని చేతికి ఇచ్చింది. తాళిని రుద్దితే చైన్ పాడవుతుందని సెంటిమెంట్‌ తో ఆమె మాట్లాడింది. నగలు తాకట్టు పెట్టేందుకు ఆధార్ కార్డు ఇవ్వాలని జైన్ చెప్పాడు. ఆధార్ కార్డు రేపు తీసుకువచ్చి ఇస్తానని, తనకు రూ. 40 వేలు ఇవ్వాలని ఆమె చెప్పింది. మహిళ రూ.40 వేలు అడగగా వడ్డీ వ్యాపారి రూ.20 వేలు మాత్రమే ఆమెకు ఇచ్చాడు. మిగిలిన రూ. 20 వేలు ఆధార్ కార్డు ఇచ్చి తీసుకోవాలని ఆమెకు చెప్పాడు.

 సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

డబ్బులు తీసుకున్న మహిళ మరుసటి రోజు, ఆ మరుసటి రోజు అయినా ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో కన్నయ్య లాల్ జైన్‌కు అనుమానం వచ్చి నగలను తనిఖీ చేయగా అవి నకిలీ నగలుగా గుర్తించారు. కన్నయ్య లాల్ జైన్ వెంటనే సెంపియం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయడమే కాకుండా అతన పాన్ షాపులో తనను మోసం చేసిన మహిళ సీసీటీవీ ఫుటేజీలు పోలీసులకు ఇచ్చాడు. చెన్నైలో పాన్ షాప్ యజమానులు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో తనకు మోసం జరిగిందని సాటి వ్యాపారులను కన్నయ్య లాల్ జైన్ హెచ్చరించి ఆమె ఫోటో పోస్ట్ చేశాడు. ఆ వాట్సాప్ గ్రూపులో చెన్నై అరుంబాక్కం ఎంఎండీఏ కాలనీ ప్రాంతానికి చెందిన పాన్ షాపు యజమాని సురేందర్‌కుమార్ వారం రోజుల క్రితం తన పాన్ షాపులో ఆ మహిళ నగలు తాకట్టు పెట్టిందని గుర్తించాడు.

 సర్వం నకిలీ బంగారం

సర్వం నకిలీ బంగారం

మహిళ దుకాణానికి వచ్చి 9 గ్రాముల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 22 వేల రూపాయలు తీసుకుని వెళ్లడంతో అతనికి అనుమానం వచ్చి మహిళ ఇచ్చిన నగలను తనిఖీ చేయగా అది నకిలీ నగలు అని తెలిసి అవాక్కయ్యాడు. పాన్ షాపు యజమాని సురేందర్ అరుంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చెన్నైలోని కిల్పాక్కంలోని ఏకే నగర్‌లో నివాసం ఉంటున్న మహాలక్ష్మి (33) అనే మహిళను అరెస్టు చేశారు. ఏడాది క్రితం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒమంతురార్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నానని మహాలక్ష్మి పోలీసులకు చెప్పింది.

 భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు

భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు

పట్టుబడిన మహాలక్ష్మి సెంబాయం, తిరువినగర్ పోలీస్ పరిధిలో నకిలీ నగలు తాకట్టు పెట్టి మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు మహాలక్ష్మిని అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి 2,500 నగదు, 1 స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. తనకు 14 ఏళ్ల క్రితం వివాహమైందని, పెళ్లయిన ఏడాదిలోపే తన భర్త బిడ్డను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడని, దీంతో కొడుకును పోషించేందుకు డబ్బులు లేవని, అందుకే ఇలా మోసం చేస్తున్నానని మహాలక్ష్మి పోలీసులకు చెప్పింది.

 టీవీ సీరియల్స్ నటి

టీవీ సీరియల్స్ నటి

8వ తరగతి చదువుతున్న తన కుమారుడి చదువుకు సంబంధించిన ఫీజునుకట్టడానికి మోసం చేస్తున్నానని మహాలక్ష్మి పోలీసులకు చెప్పింది. తాను నేరం చేశానని మహాలక్ష్మి అంగీకరించిందని పోలీసులు అన్నారు. అనేక టీవీ సీరియల్స్ లో చిన్నిచిన్న పాత్రలు వేస్తున్న మహాలక్ష్మి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం అరుంబాక్కం పోలీసులు మహాలక్ష్మిని ఎగ్మోర్ 5వ అదనపు కోర్టులో హాజరుపరిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+