Lady: నడిరోడ్డులో లేడీని కత్తితో బెదిరించి నానాహంగామా చేశారు, పాపం పెట్రోల్ ఖర్చులకు కూడా రాలేదు !

చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త చేపల వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో ఉంటున్న భార్య ఆమె పిల్లలను చూసుకుంటున్నది. మహిళను ఇద్దరు వ్యక్తులు కొంతకాలంగా ఫాలో అవుతున్నారని సమాచారం. సాయంత్రం ఇంటి సమీపంలోని కిరాణా షాపులోకి వెళ్లిన మహిళ ఇంటికి కావలసిన సరుకులు తీసుకుంది, సరుకులు తీసుకున్న మహిళ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. బైక్ లో వెళ్లిన ఇద్దరు పోటుగాళ్లు కత్తి చూపించి ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు ఇవ్వాలని బెదిరించారు.

మహిళ ధైర్యం చేసి ఎదురుతిరిగి నేను బంగారు నగలు ఇవ్వనని చెప్పింది. మహిళను బెదిరించడానికి అనేక ప్రయత్నాలు చేసిన నిందితులు చివరికి ఆమె చేతిలో ఉన్న నగదు పర్సు లాక్కొని పరారైనారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మహిళ చేతిలో పర్సు లాక్కొని వెళ్లిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మహిళను కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్న నిందితులు చోరీ చేసి చిక్కిపోయారని, కనీసం ఆమె దగ్గర పెట్రోల్ ఖర్చులకు అయ్యే డబ్బులు కూడా నిందితులకు చిక్కలేదని తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆ వెదవలను చూసి నవ్వుకున్నారు.

 వివాహిత మహిళ దంపతుల కాపురం

వివాహిత మహిళ దంపతుల కాపురం

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తండతురై ప్రాంతంలోని పలావిలై సరక్కుళం ఏరియాలో అబ్రహాం, జానెట్ (38) దంపతులు నివాసం ఉంటున్నారు. జానెట్ భర్త అబ్రహాం చేపల వ్యాపారం చేస్తున్నాడు. కొందరు కూలీలను పెట్టుకున్న అబ్రహాం వారంలో మూడు నాలుగు రోజులు సముద్రంలో చేపలు పట్టిస్తున్నాడు.

 మహిళను ఫాలో అయిన నిందితులు

మహిళను ఫాలో అయిన నిందితులు

వివాహం చేసుకున్న అబ్రహాం, జానెట్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఇంట్లో ఉంటున్న జానెట్ ఆమె పిల్లలను చూసుకుంటున్నది. ఇద్దరు వ్యక్తులు కొంతకాలంగా జానెట్ ను ఫాలో అవుతున్నారని సమాచారం. సాయంత్రం ఇంటి సమీపంలోని కిరాణా షాపులోకి వెళ్లిన జానెట్ ఇంటికి కావలసిన సరుకులు తీసుకుంది,

 కత్తితో బెదిరించారు.....చివరికి ఏం జరిగిందంటే ?

కత్తితో బెదిరించారు.....చివరికి ఏం జరిగిందంటే ?

సరుకులు తీసుకున్న జానెట్ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. బైక్ లో వెళ్లిన ఇద్దరు పోటుగాళ్లు కత్తి చూపించి బంగారు నగలు ఇవ్వాలని జానెట్ ను బెదిరించారు. జానెట్ ధైర్యం చేసి ఎదురుతిరిగి నేను బంగారు నగలు ఇవ్వనని చెప్పింది. జానెట్ ను బెదిరించడానికి అనేక ప్రయత్నాలు చేసిన నిందితులు చివరికి ఆమె చేతిలో ఉన్న నగదు పర్సు లాక్కొని పరారైనారు.

 పాపం.....పెట్రోల్ ఖర్చులకు కూడా రాలేదు

పాపం.....పెట్రోల్ ఖర్చులకు కూడా రాలేదు

బాధితురాలు జానెట్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జానెట్ చేతిలో పర్సు లాక్కొని వెళ్లిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జానెట్ ను కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్న నిందితులు చోరీ చేసి చిక్కిపోయారని, కనీసం ఆమె దగ్గర పెట్రోల్ ఖర్చులకు అయ్యే డబ్బులు కూడా నిందితులకు చిక్కలేదని తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆ వెదవలను చూసి నవ్వుకున్నారు. జానెట్ పర్సులో ఉన్న కేవలం రూ. 500 మాత్రమే ఉందని, ఆ డబ్బులో ఇద్దరు నిందితులు రెండు క్వాటర్ల మందు తాగేశారని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+